అధికార పార్టీ నాయకులకు సినిమా చూపించిన అధికారులు. అర్ద లక్ష ఫైన్!
బెంగళూరు: అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు బెంగళూరు అందాన్ని పాడుచేయకుండా ఎన్నో నిబంధనలు రూపొందించినా కొందరు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వెలుగు చూసింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరులో ఎవరైనా అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన వారికి రూ. 50, 000 జరిమానా విధిస్తామని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరులో బ్యానర్ లు ఏర్పాటు చెయ్యడంతో అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన బ్యానర్లు తొలగించిన బీబీఎంపీ అధికారులు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించడం ఇప్పుడు బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరులోని మిల్లర్ ట్యాంక్ బంబ్ ఏరియా, క్వీన్స్ రోడ్ వద్ద కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన అనధికార బ్యానర్‌ను బీబీఎంపీ సిబ్బంది సోమవారం తొలగించారు. కేపీసీసీ కార్యాలయం సమీపంలో అనుమతి లేకుండా బ్యానర్లు వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీబీఎంపీ అధికారులు రూ. 50,000 జరిమానా విధించారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెనుకబడిన తరగతుల విభాగం, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మరియు మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఉన్న ఫోటోలతో క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం సమీపంలో పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో రాజీవ్ గాంధీ ఫోటోతో పాటు మాజీ ముఖ్యమంత్రులు. డి. దేవరాజ అరసు జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట అనధికారిక బ్యానర్‌ను ఏర్పాటు చేయడం కనిపించింది. ఈ బ్యానర్ ఏర్పాటు చేసినందుకు రూ. 50 వేలు జరిమానా విధించారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరులో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను నిషేధించారు. అయినప్పటికీ బ్యానర్లు, పోస్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది. కేంద్ర నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు, భారీ కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించినప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. బీబీఎంపీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగింపుతో పాటు అపరాదరుసుం విదించే ప్రక్రియను కొనసాగించారు.












Click it and Unblock the Notifications