బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: కేపీసీసీ చీఫ్ కు కరోనా పరీక్షలు చెయ్యాలని వెళ్లిన డిప్యూటీ కలెక్టర్ కు కోవిడ్ పాజిటివ్, షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ ఆదేశాలు లెక్క చెయ్యకుండా కోవిడ్ నియమాలు ఉల్లంఘించి పాదయాత్ర చేస్తున్న కేపీసీసీ చీఫ్, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ఊహించని షాక్ ఎదురైయ్యింది. పాదయాత్ర చేస్తున్న డీకే. శివకుమార్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అనేక ప్రయత్నాలు చేసిన డిప్యూటీ కలెక్టర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం కలకలం రేపింది. వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఇదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ను కావాలనే తన దగ్గరకు పంపించి తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, తన పాదయాత్ర అడ్డుకోవడానికి ఈ చేతకాని ప్రభుత్వం కుట్రపన్నిందని డీకే శివకుమార్ ఆరోపించారు. స్కూల్ పిల్లల మద్య నిలబడి ఫోటోలు తీసుకున్న డీకే. శివకుమార్ మీద కోవిడ్ నియమాలు ఉల్లంఘించారని మరో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

khiladi: భార్య 14 ఏళ్లు చిన్నది, అందంగా ఉందని ?, చంపేసి ఇంట్లో పూడ్చేసి పైన డబుల్ కాట్ బెడ్!khiladi: భార్య 14 ఏళ్లు చిన్నది, అందంగా ఉందని ?, చంపేసి ఇంట్లో పూడ్చేసి పైన డబుల్ కాట్ బెడ్!

 పాదయాత్రకు అనుమతి లేదు

పాదయాత్రకు అనుమతి లేదు

మేకదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అందువలన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పాదయాత్రకు అనుమతి లేదని కర్ణాటక ప్రభుత్వం, పోలీసు అధికారులు, రామనగర డిప్యూటీ కలెక్టర్ టి. జవరేగౌడ ఇప్పటికే తేల్చి చెప్పారు.

డిప్యూటీ కలెక్టర్ కు కరోనా పాజిటివ్

డిప్యూటీ కలెక్టర్ కు కరోనా పాజిటివ్

మేకదాటు పాదయాత్ర మొత్తం కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కనుసైగల్లో జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలు లెక్క చెయ్యకుండా కోవిడ్ నియమాలు ఉల్లంఘించి పాదయాత్ర చేస్తున్న కేపీసీసీ చీఫ్, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ఊహించని షాక్ ఎదురైయ్యింది. పాదయాత్ర చేస్తున్న డీకే. శివకుమార్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అనేక ప్రయత్నాలు చేసిన డిప్యూటీ కలెక్టర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం కలకలం రేపింది.

పాదయాత్రలో వేలాది మంది నాయకులు

వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆదివారం రాత్రి డీకే. శివకుమార్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి రామనగర డిప్యూటీ కలెక్టర్ టి. జవరేగౌడ వెళ్లి ఆయనకు పరీక్షలు చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశారు.

ప్రభుత్వం కోవిడ్ పాజిటివ్ ఉన్న అధికారిని పంపించింది

ప్రభుత్వం కోవిడ్ పాజిటివ్ ఉన్న అధికారిని పంపించింది

రామనగర డిప్యూటీ కలెక్టర్ జవరేగౌడకు కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇక ఆంటిజన్, ఆర్ టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, ఆ పరీక్షల ఫలితాలు రావలసి ఉందని రామనగర జిల్లా ఆరోగ్య శాఖ అధికారి నిరంజన్ ఆయన్ను కలిసిన కన్నడ మీడియాకు చెప్పారు.

స్కూల్ పిల్లల మద్య నిలబడ్డారని మరో కేసు

స్కూల్ పిల్లల మద్య నిలబడ్డారని మరో కేసు

సోమవారం మేకదాటు పాదయాత్ర రెండో రోజు పాదయాత్ర జరిగింంది. డీకే శివకుమార్ కనకపుర తాలుకాలోని ఓ స్కూల్ లో పిల్లల మద్య నిలబడి ఫోటోలు తీసుకున్నారు. డీకే. శివకుమార్ మీద కోవిడ్ నియమాలు ఉల్లంఘించి చిన్నపిల్లల మద్య నిలబడి ఫోటోలు తీసుకుని వారి ప్రాణాలతో చెలగాటం ఆడారని మరో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Bengaluru: Covid Positive for Additional DC who test KPCC President DK Shivakumar Mekedatu protest politics BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X