కాళ్లకు షూలు వేసుకుని పూజలు చేసిన సీఎం, మంత్రులు ఏం తక్కువ కాదు, దొందు దొందే !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సిద్దరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ గతంలో బీజేపీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిందువులు పవిత్రంగా పూజలు చేసే సమయంలో పాదరక్షలు వదిలి కాళ్ల మీద నిలబడి పూజలు చేస్తారని అందరికి తెలుసు. బెంగళూరులో సహకార సమృద్ధి సౌధ భవనానికి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య కాళ్లకు షూలు వేసుకుని పూజలు చేసి అడ్డంగా చిక్కిపోయారు. బెంగళూరులో సహకార శాఖ ఆధ్వర్యంలో సహకార సమృద్ధి సౌధ భవనానికి బుధవారం భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య కాళ్లకు షూలు వేసుకుని అలాగే పూజలు చేయడంతో మీడియా కెమెరాల కంటికి చిక్కారు.

సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్. రాజన్న, న్యాయశాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్, మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఈ మంత్రులు అందరూ షూలు, పాదరక్షలు వేసుకుని పూజలు చేశారు. షూలు వేసుకునే సిద్దరామయ్య దేవుడికి పూలు సమర్పించి పూజలు చేస్తూ కనిపించారు.
సాధారణంగా పూజలు చేసేటప్పుడు పాదరక్షలు, చెప్పులు, షూలు తీసేయడం హిందూ సాంప్రధాయం ప్రకారం ఆనవాయితీ. చెప్పులు తీసేసి పూజలు చెయ్యడం దేవుని పట్ల చూపే గౌరవం, స్వచ్ఛమైన మనస్సుతో కూడిన భక్తితో పూజలు చేస్తారు. అయితే సిద్ధరామయ్య బూట్లు తొడుక్కోవడమే కాకుండా ఆయన వెంట ఉన్న మంత్రులు కూడా అదే బాట పట్టి పూజలు చేశారు. అందరూ పాదరక్షలు వేసుకుని భూమి పూజ చేసినట్లు వెలుగు చూసింది.

కొన్ని ప్రాంతాలను మనం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తాం. అటువంటి ప్రదేశం శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషకరమైన వాతావరణంలో స్థిరపడతారు. మన పాదాలను రక్షించుకోవడానికి పాదరక్షలను ఉపయోగిస్తాం. మనకు తోచినప్పుడల్లా ధరించి తిరుగుతున్నాం. నేలమీద చాలా మురికి, క్రిములు ఉంటాయని మనం పాదరక్షలు వేసుకుంటాము.
పవిత్ర స్థలాలకు వీటిని ధరించడం వల్ల ఆ ప్రదేశం అపవిత్రం అవుతుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి ఇళ్లు, దేవాలయాల లోపల బూట్లు, చెప్పులు ధరించరాదని చెబుతారు. ఇలాంటి సున్నిత విషయాలు తెలిసి కూడా సీఎం సిద్దరామయ్య, మంత్రులు బూట్లు వేసుకుని భూమి పూజలు చేశారని వెలుగు చూడటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతం మనోభావాలను కావాలనే వీళ్లు దెబ్బ తీస్తున్నారని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications