Plan B: చీటింగ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయుడు అరెస్టు, ఒకరు ఆత్మహత్య, మరోకరి దెబ్బతో!
బెంగళూరు: ఓ రాజకీయ నాయకుడు, ప్రముఖ బిల్డర్ తనకు వచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టు పనులను సబ్ కాంట్రాక్టులు ఇచ్చి కొందరికి పంగనామాలు పెట్టాడు. ఓ కాంట్రాక్టర్ కు కోట్ట రూపాయలు ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రముఖ రాజకీయ నాయకుడు, జాతీయ పార్టీకి చెందిన లీడర ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈయన దెబ్బకు ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదైయ్యింది.
రెండున్నర కోట్లు రూపాయలు మోసం చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరామయ్యను బెంగళూరులోని రాజగోపాల్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఐశ్వర్యగిరి కన్‌స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జయరామయ్యను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అన్నారు. అదే కంపెనీ డైరెక్టర్ శివకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం సీవరేజ్ బోర్డు పనులకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్ పొందిన బెంగళూరులోని పీణ్య రెండో స్టేజ్ కు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తిని నిందితులు మోసం చేశారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. జయరామయ్య అనే కాంట్రాక్టర్ ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నాడు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయరామయ్య వివిధ ప్రభుత్వ శాఖల్లో కోట్లాది రూపాయల పనులను కాంట్రాక్టు తీసుకున్నారు.

తరువాత ఆ కాంట్రాక్టు పనులు చాలా మందికి సబ్ కాంట్రాక్టు ఇచ్చి పనులు పూర్తి చేసేవారు. అదేవిధంగా మురుగునీటి నిర్మూలన బోర్డు పనులకు కూడా మల్లికార్జున్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2015లో జయరామయ్యను కొందరు స్నేహితుల ద్వారా మల్లికార్జున్‌ను కలిశాడు. ఈ స్నేహంతోనే మల్లికార్జున్‌కు మురుగునీటి బోర్డులోని కాంట్రాక్ట్ పనులు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. పనులు పూర్తయిన తర్వాత స్లమ్ బోర్డు నుంచి రూ.2. 54 కోట్లు. డబ్బులు అందుకున్న జయరామయ్య సబ్ కాంట్రాక్టర్ మల్లికార్జున్ కు ఆ డబ్బు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు అడిగితే నిందితులు కాంట్రాక్టర్‌ను మల్లికార్జన్ ను దూషిస్తూ చంపేస్తామని బెదిరించేవాడని పోలీసులు అన్నారు. మల్లికార్జున్ తో పాటు అతని సోదరుడు బసవరాజుకు కూడా రూ.1.20 కోట్లు అప్పు ఉన్నాడని పోలీసులు అన్నారు. జయరామయ్య దగ్గర సబ్ కాంట్రాక్ట్ పనులు చేసి మోసపోయిన బసవరాజు రెండేళ్ల క్రితం చిక్కమగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు బసవరాజు జయరామయ్య పేరు డెత్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.
బసవరాజ్ ఆత్మహత్య కేసును బాలెహోన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఐశ్వర్యగిరి కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ జయరామయ్య, డైరెక్టర్ జి. శివకుమార్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మల్లికార్జున్ కేసు పెట్టాడు. కేసు విచారణ చేసిన పోలీసులు జయరామయ్యను అదుపులోకి తీసుకున్నారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!











Click it and Unblock the Notifications