బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru riots: బెంగళూరు అల్లర్లు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ, జైల్లో నిందితుల చెక్క భజన !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి, కేజీహళ్ళిలో రణరంగం జరగడానికి, ఆ అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి కారణం అయిన నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిందితులకు జామీను మంజూరు చెయ్యడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. డీజే హళ్ళి, కేజీ హళ్లిలో గొడవలు జరగడానికి, ఆ గొడవలు వ్యాపించడానికి కారణం అయిన ఆరు మంది నిందితులను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ కేసును ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. తమకు బెయిల్ మంజూరు చెయ్యాలని నిందితులు కింది కోర్టును, తరువాత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యడానికి కింది కోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సమర్థిస్తున్నామని, మేము బెయిల్ మంజూరు చెయ్యలేమని సుప్రీం కోర్టు చెప్పడంతో జైల్లో ఉన్న నిందితులు ప్రస్తుతం జైలు నుంచి బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

Court: కోర్టులో జడ్జిని కత్తితో పొడిచేశాడు, లాయర్లు చూసి, కోర్టు ఉద్యోగి బరితెగింపు, రూమ్ లో !Court: కోర్టులో జడ్జిని కత్తితో పొడిచేశాడు, లాయర్లు చూసి, కోర్టు ఉద్యోగి బరితెగింపు, రూమ్ లో !

హడలిపోయిన ఐటీ హబ్

హడలిపోయిన ఐటీ హబ్

బెంగళూరు నగరంలోని పులకేశీనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గాన్ని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ఆరోపిస్తూ 2020 ఆగస్టు 11వ తేదీన డీజే హళ్ళి, కేజీ హళ్లిలో ఓ వర్గం వాళ్లు రెచ్చిపోయారు. పోలీసు వాహనాలతో పాటు సామాన్య ప్రజల వాహనాలకు నిప్పంటించారు.

 ఉలిక్కిపడిన బెంగళూరు

ఉలిక్కిపడిన బెంగళూరు


డీజే హళ్లి, కేజీ హళ్లితో పాటు బెంగళూరులో అల్లర్లు జరగడానికి కారణం అయ్యారు. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించి కాల్చి బూడిద చేశారు. ఆ దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి, కేజీహళ్ళిలో రణరంగం జరగడానికి, ఆ అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి కారణం అయ్యింది.

 16 నెలల ముందే నిందితులు అరెస్టు

16 నెలల ముందే నిందితులు అరెస్టు


డీజే హళ్ళి, కేజీ హళ్లిలో గొడవలు జరగడానికి, ఆ గొడవలు వ్యాపించడానికి కారణం అయిన మోహమ్మద్ కలీం, షేక్ మోహమ్మద్ బిలాల్, సయ్యద ఆసీఫ్, మోహమ్మద్ అతీఫ్, నక్విబ్ పాషా, సయ్యద్ ఇక్రముద్దీన్ అనే ఆరు మంది ప్రధాన నిందితులను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

హైకోర్టులో నో బెయిల్

హైకోర్టులో నో బెయిల్

ఈ కేసును ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. తమకు బెయిల్ మంజూరు చెయ్యాలని నిందితులు కింది కోర్టును, తరువాత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యడానికి కింది కోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. మేము జైలుకు వెళ్లి 16 నెలలు అవుతోందని, మాకు బెయిల్ మంజూరు చెయ్యాలని నిందితులు బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 బెయిల్ ఇవ్వలేమని చెప్పిన సుప్రీం కోర్టు

బెయిల్ ఇవ్వలేమని చెప్పిన సుప్రీం కోర్టు

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి, కేజీహళ్ళిలో రణరంగం జరగడానికి, ఆ అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి కారణం అయిన నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సమర్థిస్తున్నామని, మేము బెయిల్ మంజూరు చెయ్యలేమని సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ విక్రమ్ నాథ్ చెప్పారు. సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు కాకపోవడంతో జైల్లో ఉన్న నిందితులు ప్రస్తుతం జైలు నుంచి బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

English summary
Bengaluru riots: The six accused in the 2020 riots in Bengaluru's DJ Halli and KG Halli have not yet been granted bail and are not yet released. After the Sessions Court and the High Court, the Supreme Court has rejected the bail application of the six accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X