Techie: ఐఐటీలో చదివి ఐటీ హబ్ లో పనికిమాలిన పని చేసిన టెక్కీ, రాత్రి చితకబాది స్టేషన్ లో ?
బెంగళూరు/వారణాసి: ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన యువకుడికి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా మంచి ఉద్యోగం వచ్చింది. వేరే రాష్ట్రం నుంచి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న ఆ యువకుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి కర్ణాటక ప్రజలు ఎంతగానో గౌరవించే కన్నడ జెండా విషయంలో ఆ టెక్కీని కన్నడ సంఘం కార్యకర్తలు చితకబాదేశారు.
వారణాసికి చెందిన అమృతేష్ తివారి అలియాస్ అమృతేష్ (30) అనే యువకుడు ఢిల్లీలోని ఐఐటీలో చదువుకున్నాడు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో అమృతేష్ తివారికి టెక్కీగా మంచి ఉద్యోగం వచ్చింది. వారణాసి నుంచి రెండు నెలల క్రితం ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న అమృతేష్ తివారి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో అమృతేష్ తివారి నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని పరంగిపాళ్యలోని 24వ మెయిన్ రోడ్డు, 22వ క్రాస్ లో కర్ణాటక ప్రజలు ఎంతగానో గౌవరవించే కన్నడ జెండాకు టెక్కీ అమృతేష్ తివారి నిప్పు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
కన్నడ జెండాకు నిప్పు పెట్టడమే కాకుండా అమృతేష్ తివారి జెండా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆసందర్బంలో కరునాడు సేవకరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ నరసింహ, ఆ సంఘం కార్యకర్తలు విషయం గమనించి టెక్కీ అమృతేష్ తివారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అమృతేష్ తివారి మీద కేసు నమోదు చేసిన హెచ్ఎస్ఆర్ లేఐట్ పోలీసులు అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించారని వెలుగు చూసింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications