Bengaluru: బొంగులో బెంగళూరు అనుకున్నాడు, 20 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడంటే ?, హైకోర్టు దెబ్బతో ?

బెంగళూరు సీటీ ఐటీ హబ్ గా ప్రసిద్ది చెందడంతో బెంగళూరులో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీయుల నుంచి లక్షలాది మంది వచ్చి నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఉంటే సేఫ్ అనే ఫీలింగ్ కొంత మంది అనుకుంటున్నారు.

బెంగళూరు/న్యూఢిల్లీ: ఐటీ హబ్ బెంగళూరులో ఉంటే ఎలాగైనా బతకడానికి అవకాశం ఉంటుందని కొన్ని దశాభ్దాలుగా చాలా మంది అనుకుంటున్నారు. ఇక బెంగళూరు సీటీ ఐటీ హబ్ గా ప్రసిద్ది చెందడంతో బెంగళూరులో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీయులు లక్షలాది మంది వచ్చి నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఉంటే సేఫ్ అనే ఫీలింగ్ కొంత మంది అనుకుంటున్నారు. విదేశాల నుంచి ఎలాంటి పాస్ పోర్టు, అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వచ్చి మకాం వేసిన నిందితుడు జైలుపాలైనాడు. బొంగులో బెంగళూరు అనుకుని 20 ఏళ్ల నుంచి అక్రమంగా నివాసం ఉంటూ వ్యాపారం ముసుగులో అక్రమంగా భారత గుర్తింపు కార్డులు అన్నీ తీసుకున్న వ్యక్తికి హైకోర్టులో చుక్కెదురైయ్యింది.

హైకోర్టులో షాక్

హైకోర్టులో షాక్

బెంగళూరులో బతికేద్దామని ఓ వ్యక్తి సుమారుగా 20 ఏళ్లు క్రితం బెంగళూరు వచ్చాడు. భారత్‌లో అక్రమంగా ఉంటూ గుజరి వ్యాపారం చేస్తున్నాడని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అదే వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బెంగళూరులో గుజరీ వ్యాపారం చేస్తున్న సయ్యద్ ఉల్లా అఖోన్ అలియాస్ షాహిద్ అహ్మద్ అలియాస్ షాహిద బాయ్ (42) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ఉమా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు ?

ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు ?

పిటిషనర్‌సయ్యద్ ఉల్లా పై అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి గత 20 ఏళ్లుగా అక్కడే అక్రమంగా నివాసం ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి సంఘటనలు దేశ భద్రతకు ప్రమాదం కలిగించే చర్యకు సంబంధించినవని, అంతేకాకుండా ఈ కేసులో పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, ఈ నేపథ్యంలో నిందితుడు ( పిటిషనర్)కు బెయిల్‌ మంజూరు చెయ్యడానికి అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది.

బెయిల్ కోసం హైకోర్టులో అర్జీ

బెయిల్ కోసం హైకోర్టులో అర్జీ

పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చి నకిలీ పత్రాలను సృష్టించాడనే ఆరోపణలపై సయ్యద్ ఉల్లాను గత ఏడాది మే 23వ తేదీన బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సయ్యద్ ఉల్లా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నిందితుడు సయ్యద్ ఉల్లా బెయిల్ మజూరు చెయ్యాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.

నిందితుడి లాయర్ వింతవాదన ?

నిందితుడి లాయర్ వింతవాదన ?


పిటిషనర్ సయ్యద్ ఉల్తా తరఫున న్యాయవాది షాహిద్ అహ్మద్ వాదించారు. పిటిషనర్ భారతీయ పౌరుడు, అతను ఉత్తరప్రదేశ్‌లో జన్మించాడని, అతని కుటుంబం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తోందని, పిటిషనర్ దగ్గర భారతీయ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ తదితర పత్రాలు ఉన్నాయని, అయితే పోలీసు అధికారులు పొరపాటున ఈ కేసులో అతన్ని ఇరికించారని, అందువలన అతనికి బెయిల్‌ మంజూరు చేసి జైల నుంచి విడుదల చేయాలని హైకోర్టులో మనవి చేశారు.

సయ్యద్ ఉల్లా కేటుగాడు

సయ్యద్ ఉల్లా కేటుగాడు

నిందితుడి తరపు న్యాయవాది వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వ న్యాయవాది పిటిషనర్ బంగ్లాదేశ్ పౌరుడని తెలిపారు. పాస్‌పోర్టు, వీసా లేకుండానే భారత్‌లోకి ప్రవేశించాడని, బెంగళూరులో గుజరీ దుకాణం నడుపుతున్న అతడు తన నివాస చిరునామాను బెంగళూరుకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, అనేక నకిలీ పత్రాలు సృష్టించాడని, అందువలన అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరు వచ్చి ఇక్కడే మకాం వేసిన నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+