Student: ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లోని బాత్ రూమ్ లో శవమైన విద్యార్థి, దుబాయ్ లో ?
బెంగళూరు/తిరువనంతపురం: దంపతులకు ఇద్దకు కుమారులు ఉన్నారు. దంపతులు ఇద్దరూ దుబాయ్ లో ఉంటున్నారు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. రెండో కొడుకును ఇంజనీరింగ్ లో చేర్పించాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అన్న అతని తమ్ముడిని ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాడు. ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరిన 15 రోజులకే కాలేజ్ ప్యాంపస్ లోని బాత్ రూమ్ లో ఆ యువకుడి గొంతు తెగిపోయి శవమై కనిపించడం కలకలం రేపింది.

దుబాయ్ లో నితిన్ తల్లిదండ్రులు
కేరళలోని కోజికోడ్ జిల్ాోని పదని జరియా ప్రాంతంలోని కోయంలాండి గ్రామంలో నితిన్ (19) అనే యువయుడు నివాసం ఉంటున్నాడు. నితిన్ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల నుంచి దుబాయ్ లో ఉంటున్నారు. సెలవుల్లో అప్పుడప్పుడు కేరళకు వస్తున్న దంపతులు వారి ఇద్దరు కుమారులతో కిలసి కొంతకాలం ఉండి తరువాత దుబాయ్ వెళ్లిపోతున్నారు.

బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజ్
నితిన్ అన్న ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరు సిటీ సమీపంలోని ఆనేకల్ లోని ప్రముఖ కాలేజ్ లో నితిన్ ను చేర్చాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో నితిన్ ను మొదటి సంవత్సరం సీఇఎస్ గ్రూప్ లో చేర్పించారు. నితిన్ ను అతని అన్న స్వయంగా కాలేజ్ లో చేర్పించి కాలేజ్ ఫీజు కట్టి తరువాత అతను కేరళ వెళ్లాడు.

బాత్ రూమ్ లో గొంతు కోసుకున్న నితిన్
నితిన్ అతని స్నేహితులతో కలసి రూమ్ లో ఉన్నాడు. కాలేజ్ క్యాంపస్ ఆవరణంలోని బాత్ రూమ్ లో నితిన్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాటికాలేజ్ అబ్బాయిలు నితిన్ బాత్ రూమ్ లో శవమైన విషయం గుర్తించి కాలేజ్ యాజమాన్యంకు, బన్నేరుఘట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

15 రోజులకే ఏం జరిగింది ?
బన్నేరుఘట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించి కేరళలోని అతని అన్నకు సమాచారం ఇచ్చారు. కాలేజ్ లో చేరిన 15 రోజులకే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది, నితిన్ రూమ్ లో ఉన్న అబ్బాయిను, అతని స్నేహితులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని బన్నేరుఘట్ట పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications