girl cd apartment bedroom romance video case sit answer family questions life wife bengaluru అమ్మాయి అపార్ట్ మెంట్ రొమాన్స్ వీడియో కేసు హాజరు సిట్ ఫ్యామిలీ ప్రశ్నలు జీవితం భార్య తండ్రి బెంగళూరు
CD Scandal: పీజీ సుందరికి పోలీసుల నోటీసులు, వీడియో తీసిన అపార్ట్ మెంట్ ఎక్కడ ?, టెన్షన్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారం రసవత్తరంగా మారింది. ఇప్పటికే రమేష్ జారకిహోళికి నోటీసులు జారీ చేసి ఆయన్ను విచారణ చేసిన పోలీసులు ఇప్పుడు సీడీలో ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ సుందరికి నోటీసులు జారీ చేశారు. మీరు మా ముందు హాజరై మాకు వివరణ ఇవ్వాలని, రాసలీలల సీడీ ఎక్కడ తీశారో ?, ఆ అపార్ట్ మెంట్ ఎక్కడ ఉంది ?, ఆ ప్రాంతంలో పంచనామా నిర్వహించడానికి మీరు సహకరించాలని బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చెయ్యడంతో కథ రసవత్తరంగా మారింది. పోలీసుల ముందు ఈ రోజు (మార్చి 30వ తేదీ మంగళవారం) సీడీ సుందరి హాజరుకావలసి ఉండటంతో అప్పుడు ఈ కేసుతో లింక్ ఉన్న కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Illegal affair: ఆంటీ కోసం వెళితే పక్కలో పక్కింటి ఆంటి, గ్రహాలు రివర్స్, దెబ్బకు క్లోజ్!

అయ్యాగారు హాజరైనారు
రాసలీలల సీడీలో ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సోమవారం బెంగళూరులోని ఆడుగోడిలోని టెక్నికల్ సెల్ పోలీసు అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఏప్రిల్ 2 విడుదల
కబ్బన్ పార్క్ పోలీసులు, టెక్నికల్ సెల్ పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో తనకు నాలుగు రోజులు కాలావకాశం ఇస్తే మీరు అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇస్తానని రమేష్ జారకిహోళి, ఆయన తరపు న్యాయవాదులు పోలీసు అధికారులకు చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసు అధికారులు రమేష్ జారకిహోళికి సూచించారు.

అమ్మాయి ఫ్యామిలీ
రాసలీలల సీడీలో ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి తండ్రి మాజీ మిలటరి ఉద్యోగి మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె ఇప్పుడు చాలా ఒత్తిడి గురైఉందని, సిట్ అధికారులు, కోర్టు ఆమెను ప్రశాంతంగా నాలుగు రోజులు వదిలేయాలని, తరువాత ఆమె ఇచ్చే స్టేట్ మెంట్ తీసుకోవాలని మనవి చేశారు. మాకు కర్ణాటక పోలీసుల మీద నమ్మకం ఉందని, సిట్ దర్యాప్తుపైన పూర్తి నమ్మకం ఉందని, మాకు న్యాయం జరుగుతుందని అమ్మాయి తండ్రి ధీమా వ్యక్తం చేశారు.

మేడమ్ దెబ్బతో ఇంత జరిగింది
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని, అపార్ట్ మెంట్ కు పిలిపించుకుని ఉద్యోగం ఇస్తానని నమ్మించి తన జీవితంతో చెలగాటం ఆడాడని ఆరోపిస్తూ పీజీ సుందరి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఆమె తరపు న్యాయవాది జగదీష్ సహాయంతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యువతి కేసు పెట్టడంతో మాజీ మంత్రి రమేష్ జారకిహోళిని విచారణ చేసిన పోలీసులు ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు.

మేడమ్ మీరు రావాలి
రాసలీలల సీడీలో ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ సుందరికి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మీరు మార్చి 30వ తేదీ మంగళవారం మా ముందు హాజరై మాకు వివరణ ఇవ్వాలని పోలీసులు సూచించారు. రాసలీలల సీడీ విడుదలైన తరువాత సుమారు 25 రోజులకు పైగా ఆ సీడీలో ఉన్న అమ్మాయి ఎవ్వరికీ కనపడకుండా రహస్య ప్రాంతం నుంచి వరుసగా వీడియోలు విడుదల చేస్తోంది.

రాసలీలల తీసిన స్పాట్ ఎక్కడ ?
రాసలీలల సీడీ ఎక్కడ తీశారో ?, మీరు చెబుతున్న ఆ అపార్ట్ మెంట్ ఎక్కడ ఉంది ?, మీరు చెప్పిన చోటికి వెళ్లి ఆ ప్రాంతంలో పంచనామా నిర్వహించడానికి మీరు సహకరించాలని బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు సీడీ సుందరికి నోటీసులు జారీ చెయ్యడంతో కథ రసవత్తరంగా మారింది.

మేడమ్ బయటకు వస్తుందా ?
బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసుల ముందు ఈ రోజు సీడీ సుందరి హాజరు అవుతుందా ? లేదా ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. మరో వైపు సీడీ సుందరి కోర్టు ముందు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఇప్పటికే న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఏ కోర్టు ముందు ఆమె హాజరుకావాలి అనే విషయం మాత్రం కచ్చితంగా తెలియడం లేదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు.