Rahul Gandhi: కర్ణాటకలో యువరాజు టూర్ డేట్ ఫిక్స్, టార్గెట్ 150 సీట్లు, అంతేనా!
బెంగళూరు: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటకలో పర్యటించడానికి రంగం సిద్దం చేశారు. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీమ్ అహమ్మద్ అన్నారు.
మంగళవారం సాయంత్రం (ఆగస్టు 2వ తేదీ) సాయంత్రం రాహుల్ గాంధీ కర్ణాటకలోని హావేరీకి చేరుకుంటారని సలీమ్ అహమ్మద్ అన్నారు. రాత్రి 8 గంటలకు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ వివిద అంశాలపై చర్చించనున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో సమావేశం
బుధవారం చిత్రదుర్గ వెలుతున్న రాహుల్ గాంధీ సిద్దరామయ్య 75వ జన్మదినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకున్న రాహుల్ గాంధీ ఇప్పటికే నుంచి ఆ రాష్ట్రంలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications