బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Terrorist: కుక్కర్ బాంబుకు దుబాయ్ ఆలీ డైరెక్షన్, ఏకే-47 కోసం లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడుతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించిన మోహమ్మద్ షారీఖ అలియాస్ షారీఖ్ గురించి కలకలం రేపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను సంప్రధించి ఏకే-47 తెప్పించుకోవాలని ప్రయత్నించాడని తెలిసింది. హిందూ సంఘ, సంస్థ నాయకులతో పాటు పోలీసులను టార్గెట్ చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కుక్కర్ బాంబు పేలుడు కోసం షారీఖ్ ఐసీస్ తో సంబంధాలు పెట్టుకుని దుబాయ్ లో తలదాచుకున్న కర్ణాటకకు చెందిన ఉగ్రవాది అరాఫత్ ఆలీ అలియాస్ ఆరాఫత్ సలహాలు, సూచనలు తీసుకున్నాడని పోలీసులకు సమాచారం అందిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !

 మంగళూరు టార్గెట్

మంగళూరు టార్గెట్

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారీఖ్ ఇటీవల మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు సృష్టించడానికి ప్రయత్నించాడు. అయితే అనుకున్న టైమ్ కంటే మార్గం మద్యలోనే ఆ కుక్కర్ బాంబు ఆటోలో పేలిపోవడంతో తీవ్రగాయాలైన షారీఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు

లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు

లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను సంప్రధించడానికి షారీఖ్ అనేక ప్రయత్నాలు చేశాడని పోలీసులకు సమాచారం అందింది. లష్కర్ ఏ తెయిబా ఉగ్రవాదుల సహాయంతో ఏకే-47 తెప్పించుకోవాలని షారీఖ్ ప్రయత్నించాడని తెలిసింది. హిందూ సంఘ, సంస్థ నాయకులతో పాటు పోలీసులను టార్గెట్ చేసుకున్నాడని, అందుకే షారీఖ్ ఏకే-47 తెప్పించుకోవాలని ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిసిందని ప్రముఖ కన్నడ పత్రిక కథనం తెలిపింది.

దుబాయ్ ఉగ్రవాదితో లింక్

దుబాయ్ ఉగ్రవాదితో లింక్

కర్ణాటకలోని తీర్థహళ్లి నివాసి ఆరాఫత్ ఆలీ అలియాస్ అరాఫత్ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుని దేశం వదిలిపారిపోయి దుబాయ్ లో ఉంటున్నాడు. మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు దుబాయ్ లో ఉన్న అరాఫత్ ఆలీ స్కెచ్ వేశాడని, అందుకే షారీఖ్ ను రంగంలోకి దింపాడని పోలీసులకు సమాచారం అందింది.

దుబాయ్ ఆలీ డైరెక్షన్?

దుబాయ్ ఆలీ డైరెక్షన్?

దుబాయ్ లో తలదాచుకున్న కర్ణాటకకు చెందిన ఉగ్రవాది అరాఫత్ ఆలీ అలియాస్ ఆరాఫత్ సలహాలు, సూచనలు తీసుకున్నాడని, అయితే వారి స్కెచ్ రివర్స్ అయ్యిందని పోలీసులకు సమాచారం అందిందని వెలుగు చూసింది. అరాఫత్ ఆలీ సూచన మేరకు షారీఖ్ ఆటోలో కుక్కర్ బాంబు తీసుకెలుతున్న సమయంలో అది మద్యలో పేలిపోయిందని పోలీసులు అంటున్నారు.

నోరు విప్పితేనే అసలు మ్యాటర్ తెలుస్తోంది

నోరు విప్పితేనే అసలు మ్యాటర్ తెలుస్తోంది

కుక్కర్ బాంబు తయారు చే మయంలో, వివిద ప్రాంతాల్లో సంచరించే సమయంలో షారీఖ్ సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నాడని, ఆ ఫోటోలు మొత్తం అతని మొబైల్ లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. భారత్ నిషేధించిన ఇస్లామిక్ రిచర్డ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) చీఫ్ జాకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాల వీడియోలు కూడా షారీఖ్ మొబైల్ ఫోన్ లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

ఎన్ఐఏ వెయిటింగ్

ఎన్ఐఏ వెయిటింగ్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షారీఖ్ నోరు విప్పితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. అయితే షారీఖ్ కొలుకున్న వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు వేచి చూస్తున్నారు. కుక్కర్ బాంబు పేలుడుతో 40 శాతం గాయాలైన షారీఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాడు.

English summary
Cooker bomb case: Suspected terrorist Shariq tries to bring AK 47 by contacting lashkar e taibalashkar terrarist. says sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X