బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: ఐటీ హబ్ లో మళ్లీ లాక్ డౌన్ ?, సీఎం ఇష్టం, ఆ దెబ్బతోనే ఇంత రామాయణం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రజలకు అధికారులు సహకరించడం లేదని, అధికారులకు ప్రజలు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో కొత్తగా మరో ఐదు కంటోన్మెంట్ జోన్లు ప్రకటించారు. కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల్లో బెంగళూరులోనే అధిక శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ అమలు చేసే విషయంలో బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ గోడ మీద దీపం పెట్టి సీఎం కోర్టులోకి బాల్ తన్నేశారు. కొన్ని దెబ్బలతోనే కరోనా వైరస్ వ్యాపిస్తోందని అధికారులు అంగీకరిస్తున్నారు.

CD Girl: మాజీ మంత్రి రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి ఇంట్లో అన్ని లక్షలా ?, బీర్లు, వైన్, వామ్మో !CD Girl: మాజీ మంత్రి రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి ఇంట్లో అన్ని లక్షలా ?, బీర్లు, వైన్, వామ్మో !

బెంగళూరు హడల్

బెంగళూరు హడల్

బెంగళూరు నగరంలో గత 10 రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్న బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ బెంగళూరులోని అన్ని వార్డుల్లోని ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో అత్యవసరంగా సమావేశం నిర్వహించి కరోనా పాజిటివ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు.

బెంగళూరులో లాక్ డౌన్ ?

బెంగళూరులో లాక్ డౌన్ ?

బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారులతో సమావేశం పూర్తి అయిన తరువాత బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ అరికట్టడానికి బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తారు ? అని జరుగుతున్న ప్రచారంపై బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ హింట్ ఇచ్చారు.

ఫంక్షన్ హాల్స్, పార్క్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్

ఫంక్షన్ హాల్స్, పార్క్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్

బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న మాట వాస్తవం అని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ అన్నారు. బెంగళూరులోని 12 ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులోని పార్క్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఫంక్షన్ హాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చెయ్యాలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు మనవి చెయ్యాలని నిర్ణయించామని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ అన్నారు.

ఏదైనా సీఎం ఇష్టం

ఏదైనా సీఎం ఇష్టం

బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేసి ఆ మహమ్మారిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తాము మనవి చేస్తామని మంజునాథ్ ప్రసాద్ అన్నారు. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చెయ్యాలా ? వద్దా ? అనే విషయం ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్ణయిస్తారని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ వివరించారు. ప్రజలు సహకరించకపోతే లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని ఆయన చిన్న క్లూ ఇచ్చారు.

 పెద్దలు ఏం డిసైడ్ చేస్తారో ?

పెద్దలు ఏం డిసైడ్ చేస్తారో ?

బెంగళూరుతో పాటు కర్ణాటకలో కరోనా వైరస్ నియంత్రించడానికి నిపుణలు సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్లలో 50 శాతానికి మంచి సీట్లు భర్తి చెయ్యకూడదని నియమాలు పెట్టారు. అయితే సినిమా థియేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలిసింది. కరోనా వైరస్ కట్టడికి ప్రజల పూర్తి సహకారం అవసరం అని, వాళ్లు సహకరిస్తే కరోనా కట్టడి అవుతోందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మొత్తం మీద ఐటీ హబ్ లో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తారా ?, లేదా ? అనే విషయంలో ఇంత వరకు పక్కా క్లారిటీ మాత్రం రాలేదు.

English summary
Coronavirus: Amid Coronavirus cases increasing, Bengaluru Municipal Commissioner N. Manjunath Prasada has hinted that at least a partial lockdown may be imposed in the city if people don’t follow COVID protocol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X