Couple: కావలసినంత డబ్బు, ఆస్తీ, కరోనా, బ్లాక్ ఫంగస్ భయంతో, భార్యతో కలిసి వ్యాపారి, అపార్ట్ మెంట్ లో !

బెంగళూరు/మంగళూరు: కరోనా వైరస్ హమ్మారి దెబ్బతో, బ్లాక్ ఫంగస్ భయంతో చాలా మంది హడలిపోతున్నారు. కావలసినంత ఆస్తీ, డబ్బులు, పలుకుబడి ఉన్న దంపతులు ఇంతకాలం చాలా సంతోషంగా జీవించారు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ లో నివాసం ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇదే సమయంలో దంపతులకు షాకింగ్ విషయం తెలిసింది. బయట తిరిగి వస్తున్న దంపతులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. వారం రోజుల నుంచి కరోనా వైరస్ భయంతో ఇంట్లోనే ఉంటున్న దంపతులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. కరోనా వైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వచ్చిందంటే జీవితం దుర్బరం అవుతోందని భయపడిన దంపతులు ఏం చెయ్యాలో అర్థం కాకపోవడంతో సతమతం అయ్యారు. ఇక ప్రాణాలతో ఉండి మనం ఎవరిని ఉద్దరించాలని, ఆత్మహత్య చేసుకుంటే ఒక పని అయిపోతుందని దంపతులు'ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు కమీషనర్ కు ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని సమాచారం ఇచ్చిన దంపతులు ఆత్మహత్య అనుకున్నంతపని చేసేశారు. సిటీ పోలీసు కమీషనర్ ఆదేశాల మేరు పోలీసులు అడ్రస్ ట్రేస్ చేసి వెళ్లే సరికి దంపతులు ఇద్దరూ అపార్ట్ మెంట్ లో శవమై కనపించారు. దంపతుల అత్యంక్రియలకు రూ. 1 లక్ష ఇచ్చిన దపంతులు, అపార్ట్ మెంట్ లోని అన్ని వస్తువులు విక్రయించి పేదలకు సహాయం చెయ్యాలని సూసైడ్ నోట్ రాసి పెట్టడం కలకలం రేపింది.

అపార్ట్ మెంట్ లో దంపతులు

అపార్ట్ మెంట్ లో దంపతులు


కర్ణాటకలోని మంగళూరు సిటీ శివార్లలోని చిత్తాపురలోని రహేజా అపార్ట్ మెంట్ లో రమేష్, గుణా దంపతులు నివాసం ఉంటున్నారు. కావలసినంత ఆస్తీ, డబ్బులు, పలుకుబడి ఉన్న రమేష్, గుణా దంపతులు ఇంతకాలం చాలా సంతోషంగా జీవించారు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ లో నివాసం ఉంటున్న రమేష్, గుణా దంపతులు వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

కరోనా పాజిటివ్, బ్లాక్ ఫంగస్ వస్తుందని భయం ?

కరోనా పాజిటివ్, బ్లాక్ ఫంగస్ వస్తుందని భయం ?

ఇటీవల రమేష్, గుణా దంపతులకు షాకింగ్ విషయం తెలిసింది. బయట తిరిగి వస్తున్న రమేష్, గుణా దంపతులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. వారం రోజుల నుంచి కరోనా వైరస్ భయంతో ఇంట్లోనే ఉంటున్న రమేష్, గుణా దంపతులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. కరోనా వైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వచ్చిందంటే జీవితం దుర్బరం అవుతోందని భయపడిన రమేష్, గుణా దంపతులు ఏం చెయ్యాలో అర్థం కాకపోవడంతో సతమతం అయ్యారని సమాచారం.

ఆత్మహత్య చేసుకోవాలని ఆవేశంలో డిసైడ్

ఆత్మహత్య చేసుకోవాలని ఆవేశంలో డిసైడ్

రమేష్, గుణా దంపతులకు పిల్లలు లేరు. ఇక ప్రాణాలతో ఉండి మనం ఎవరిని ఉద్దరించాలని, ఆత్మహత్య చేసుకుంటే ఒక పని అయిపోతుందని రమేష్, గుణా దంపతులు'ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని సమాచారం ఇచ్చిన రమేష్, గుణా దంపతులు వారు నివాసం ఉంటున్న రహేజా అపార్ట్ మెంట్ లోని సొంత ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నారు.

అంత్యక్రియలకు రూ. 1 లక్ష డబ్బులు

అంత్యక్రియలకు రూ. 1 లక్ష డబ్బులు

మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఆదేశాల మేరు పోలీసులు రమేష్ అడ్రస్ ట్రేస్ చేసి అపార్ట్ మెంట్ లోకి వెళ్లే సరికి దంపతులు ఇద్దరూ అపార్ట్ మెంట్ లో శవమై కనపించారు. మా అంత్యక్రియలకు రూ. 1 లక్ష అక్కడ పెట్టామని అంతకు ముందే రమేష్ మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు వాయిస్ మెసేజ్ పంపించారు. మా అపార్ట్ మెంట్ లోని అన్ని వస్తువులు విక్రయించి పేదలకు సహాయం చెయ్యాలని రమేష్, గుణా దంపతులు సూసైడ్ నోట్ రాసి పెట్టడం కలకలం రేపింది.

భయంతో ఇలా చేశారా ? లేక

భయంతో ఇలా చేశారా ? లేక

రమేష్, ఆయన భార్య గుణాకు కరోనా పాజిటివ్ వచ్చిందని మా దగ్గర సమాచారం లేదని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. కేవలం కరోనా వచ్చిందని ఏమైనా ఊహించుకుని ఆత్మహత్య చేసుకున్నారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న రమేష్, తన భార్య గుణాకు ఇంకా పిల్లలు పుట్టలేదని చాలా కాలంగా విచారం వ్యక్తం చేసేవాడని ఆయన స్నేహితులు అంటున్నారు. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ భయంతో వ్యాపారి రమేష్, ఆయన భార్య గుణా ఆత్మహత్య చేసుకోవడంతో మంగళూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+