Sister: అక్క లవ్ మ్యారేజ్, దసరా పండుగకు వచ్చిన బావను నరికేసిన బావమరుదులు, మ్యాటర్ వేరే!
బెంగళూరు/కలబురిగి: యువతి, యువకుడు ప్రేమించుకుని సంతోషంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత రెండు కుటుంబాలు కలిసిపోయాయి. భార్యకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అక్క ఇంటికి వెళ్లి వస్తున్న ఇద్దరు తమ్ముళ్లు వాళ్ల బావతో చాలా సరదాగా, ఫెండ్లీగా ఉండేవాళ్లు. బావ, బావమరుదులు కలిసి పార్టీలు చేసుకుంటున్నారు.
దసరా పండుగ సందర్బంగా అక్కాబావా ఇంటికి వచ్చారు. ఇదే సందర్బంలో అక్క కళ్ల ముందే ఆమె ఇద్దరు తమ్ముళ్లు వాళ్ల బావను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

అక్క లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని కలబురిగి నగరంలో రూపా (పేరు మార్చడం జరిగింది). రూపాకు ప్రశాంత్, శివకాంత్ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రూపా, లక్ష్మీపుత్ర అనే యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుని సంతోషంగా పెళ్లి చేసుకున్న రూపా, లక్ష్మీపుత్ర హ్యాపీగా కాపురం చేస్తున్నారు.

బావ, బావమరుదులు క్లోజ్
వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత రూపా, లక్ష్మీపుత్రల కుటుంబాలు కలిసిపోయాయి. భార్య రూపా తమ్మళ్లులు ప్రశాంత్, శివకాంత్ కూడా సైలెంట్ అయిపోయారు. అక్క రూపా ఇంటికి వెళ్లి వస్తున్న ఇద్దరు ఆమె తమ్ముళ్లు శివకాంత్, ప్రశాంత్ వాళ్ల బావ లక్ష్మీపుత్రతో చాలా సరదాగా, ఫెండ్లీగా ఉండేవాళ్లు. బావ, బావమరుదులు కలిసి పార్టీలు చేసుకుంటున్నారు.

అక్కడే వచ్చింది సమస్య
వ్యాపారం చెయ్యడానికి ప్రశాంత్, శివకాంత్ వాళ్ల అక్క భర్త లక్ష్మీపుత్రను అప్పు అడిగాడు. భార్య కూడాఒత్తిడి చెయ్యడంతో లక్ష్మీపుత్ర మూడు సంవత్సరాల క్రితం బావమరుదులు ప్రశాంత్, శివకాంత్ కు రూ. 8 లక్షలు అప్పు ఇచ్చాడు. అక్కడే డబ్బు విషయంలో బావ లక్ష్మీపుత్ర, అతని బావ మరుదల మద్య తేడా వచ్చేసింది.

డెడ్ లైన్ పెట్టిన పెద్దలు
తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని లక్ష్మీపుత్ర అతని బావమరుదులకు చెప్పాడు. రూపా కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని తమ్ముళ్ల మీద ఒత్గిడి చేసింది. పంచాయితీలు చేసిన పెద్దలు అక్టోబర్ 1వ తేదీ లోపు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ప్రశాంత్, శివకాంత్ కు చెప్పారు. అయిత ప్రశాంత్, శివకామంత్ మాత్రం వాళ్ల బావ లక్ష్మీపుత్రకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు.

ఇంటికి వచ్చిన బావను నరికి చంపేశారు
దసరా పండుగ సందర్బంగా అక్కారూపా, బావా లక్ష్మీపుత్ర బావమరుదులు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. డబ్బులు అడగటానికి వచ్చాడని బావమరుదులు అనుకున్నారు. అయితే వాళ్లు వెళ్లింది దసరా పండుగ అని వెళ్లారు. ఇదే సందర్బంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో అక్క కళ్ల ముందే ఆమె ఇద్దరు తమ్ముళ్లు ప్రశాంత్, శివకాంత్ వాళ్ల బావ లక్ష్మీపుత్రను వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపేసి పారిపోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications