టెక్కీ దూలతీరిపోయింది, కాల్ గర్ల్స్ ను పంపిస్తామని చివరికి ఏం చేశారంటే?

బెంగళూరు: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడికి అమ్మాయిని పంపిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ఇద్దరు నిందితులను బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాసన్‌కు చెందిన నగేష్, బెంగళూరులోని కురుబరహళ్లికి చెందిన నదీమ్ పాషాలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 60వేలు, నేరానికి ఉపయోగించిన ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మరో నిందితుడు మైసూరుకు చెందిన చంద్రశేఖర్ పరారీలో ఉండడంతో అతడి పోలీసులు గాలిస్తున్నాు. నిందితులు రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన ఎం. గౌతమ్‌ అనే యువకుడితో మాట్లాడారు, తరువాత నీకు అందమైన యువతిని పంపిస్తామని మాయమాటలు చెప్పి ఫోన్‌ చేసి రూ. 62వేలు తీసుకున్నారు. తరువాత మ్యాటర్ బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు.

Cunning gang doing loots in Bengaluru believing that they will send call girls after discussing a deal online

ఆగస్టు 21న ఆన్‌లైన్‌లో అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు ఫిర్యాదుదారు గౌతమ్‌కు లోకాంటో అనే యాప్ ద్వారా లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మొబైల్ నంబర్‌కు వాట్సాప్ కాల్ చేయగా కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి అమ్మాయిని పంపిస్తానని రిలయన్స్ డిజిటల్ సెక్టార్ 6 (హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు) రమ్మని చెప్పాడు. దీంతో గౌతమ్ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నిందితులు సూచించిన ప్రదేశానికి వెళ్లాడు.

ఈ సమయంలో నిందితులు గౌతమ్‌ని బలవంతంగా ఆటో రిక్షాలో ఎక్కించి నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించారు. అప్పుడు గౌతమ్ తన వద్ద ఉన్న .2 వేల నగదు ఇచ్చాడు. అంతటితో సరిపెట్టుకోకుండా నిందితులు యూపీఐ ద్వారా రూ. 60,000 గూగుల్ల పే ద్వారా వారి అకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే ఊరుకునేది లేదని, నిన్ను వెతికి పట్టుకుని చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

డబ్బులు పోగొట్టుకున్న గౌతమ్‌ ఈ విషయమై హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా గౌతమ్ నుంచి నగదు బదిలీ చేసిన యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్‌ను పరిశీలించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు లోకాంటో యాప్‌లో యువతుల పేరుతో ఖాతాలు తెరిచి అందమైన అమ్మాయిల ఫొటోలు పోస్ట్ చేసేవారు.

ఈ ఫొటోలు చూసిన వారితో మెసేజ్‌లు పంపిన వారితో ఫ్రీగా చాటింగ్ చేసేవాడు. శారీరక సంబంధానికి తాను సిద్ధంగా ఉన్నానని మెసేజ్ లె పంపాడు. వ్యక్తి ఆసక్తి చూపితే అతను స్థలం గురించి సమాచారం ఇచ్చి అతన్ని ఆహ్వానించారు. ఇది నమ్మి నిందితులు చెప్పిన స్థలానికి వస్తే కత్తులతో బెదిరించి డబ్బు, బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను లాక్కొని వెలుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+