ప్రభుత్వాన్ని కూల్చడానికి సింగపూర్ లో స్కెచ్, సీఎం రియాక్షన్ ఎలా ఉందంటే!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం కర్ణాటకలో కాదు సింగపూర్‌లో జరుగుతుందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ఇప్పుడే కర్ణాటకలో అదే హాట్ టాపిక్ అయ్యింది. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు.
సింగపూర్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎలాంటి కుట్రలు పన్నారు అనే విషయం తనకు ఏమాత్రం తెలీదని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఎవరు స్టేట్‌మెంట్ ఇచ్చారో తనకు తెలీదు. డీకే శివకుమార్ చెప్పారని మీరు అంటున్నారని, ఆయన్నే మీరు సమాధానం అడగాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో అన్నారు.

హవేరీలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని బీజేపీ ట్రోల్ చేయడంపై స్పందిస్తూ ఇప్పుడు వర్షాలు పడలేదా అని ప్రశ్నించారు. ఈ మూఢనమ్మకాలను తాను నమ్మను అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. కర్ణాటకలో అందరిని ఆదుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం సిద్దరామయ్య అన్నారు.
బీజేపీ హయాంలో వరదల వల్ల లక్ష ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలు, వర్షాభావ పరిస్థితులు సహజం. ఇప్పుడు వాతావరణంలో మార్పు వచ్చింది. రుతుపవనాలు జూన్‌లో ప్రారంభమై జూలైలో సంభవిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కర్ణాటకలో మాత్రమే వానలు పడలేదని సీఎం సిద్దరామయ్య తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ కలసి పోటీ చేస్తారనే విషయం తనకు తెలియదని, ఆరెండు పార్టీలు ఒక్కటైతే మేము భయపడాల్సిన పనిలేదని, ప్రజల ఆశీర్వాదంతో 15 నుంచి 20 సీట్లు గెలుచుకుంటామని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తంచేశారు. డీకే శివకుమార్, సిద్దరామయ్యకు పడటం లేదని అందరికి తెలిసిందే. అయితే సింగపూర్ స్కెచ్ విషయంలో కూడా సీఎం సిద్దరామయ్య తనకు ఏమీ తెలీదని, డీకే శివకుమార్ నే అడగాలని చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications