పార్టీ మారింది, ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఏం చేస్తున్నారంటే, కనపడితే చాలు!
బెంగళూరు/హాసన్/మైసూరు: ప్రభుత్వాలు మారిన తరువాత ప్రత్యర్థుల మీద ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలకు కన్నుపడుతుంది. అధికారం మారిన తరువాత ఏ రాష్ట్రంలో చూసిన ఇదే జరుగుతుందని చాలాసార్లు వెలుగు చూసింది. ఇదే ఇప్పుడు మరోసారి వెలుగు చూసింది. ప్రభుత్వం మారడంతో ప్రత్యర్థులు రెచ్చిపోయారు. దొరికిన వాడిని దొరికినట్లు చంపేస్తున్నారు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో పట్టపగలు ఓ రౌడీషీటర్ సినిమా థియేటర్ ముందే దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు రౌడీషీటర్‌ను మార్గమధ్యంలో కొట్టి ఆయుధాలతో నరికి చంపారు. మస్తీగౌడ (30) అనే రౌడీ హత్యకు గురైనాడు. ఈ సంఘటన హాసన్ జిల్లాలోని చెన్నరాయపట్నంలోని ధనలక్ష్మి సినిమా ఎదుట చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో వచ్చిన నలుగురైదుగురు యువకులు రౌడీ మస్తీగౌడను హత్య చేసి తప్పించుకున్నారని పోలీసులు అంటున్నారు..

మస్తీగౌడ చెన్నరాయపట్నం తాలూకా హొన్నమారనహళ్లి గ్రామానికి చెందినవాడు. మస్తీగౌడ పేరు అనేక కేసుల్లో ఉంది. మస్తీగౌడ ఓ రౌడీ. నడిరోడ్డులో సినిమా థియేటర్ ముందు మస్తీగౌడ హత్యతో చెన్నరాయపట్నం వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ ఘటన చెన్నరాయపట్నం పోలీసుల కేసు విచారణ చేస్తున్నారు.
శ్రీరంగపట్నంలో రౌడీషీటర్‌ను అతని స్నేహితులే గొంతు నులిమి హత్య చేసిన దారుణ సంఘటన తాలూకాలోని హులికెరె గ్రామ సమీపంలో గత వారం చోటుచేసుకుంది. కేఆర్‌ఎస్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న సుధీర్(35)ని పట్టపగలు అతని స్నేహితులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
సుధీర్, పూర్ణచంద్ర, ముగ్గురు నలుగురు స్నేహితులు ఉదయం మందు పార్టీ చేసుకున్నా పీకలదాక మద్యం సేవించారు.ఈ సమయంలో పూర్ణచంద్ర, అతని స్నేహితులు సుధీర్‌తో చిన్నపాటి గొడవ పడ్డారు. దీంతో సుధీర్ మందు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడు.
హులికెరె రోడ్డు సమీపంలోకి వచ్చిన సుధీర్‌ను పూర్ణచంద్ర అతని స్నేహితులు అనుసరించి మార్గమధ్యంలో సుధీర్‌ను హత్య చేసి పరారయ్యారు. ఈ విషయమై ప్రజలు కేఆర్‌ఎస్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.పాత కక్షలతో సుధీర్‌ను అతని స్నేహితులే నరికి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications