ఇంజనీరింగ్ కాలేజ్ 8వ అంతస్తు నుంచి కిందకు దూకేసిన బీటెక్ స్టూడెంట్!
బెంగళూరు/మంగళూరు: బెంగుళూరులోని పీఈఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టాడని, మొబైల్ చూస్తూ పరీక్షలు రాస్తున్నాడని గమనించిన లెక్చరర్ అతడి మొబైల్ ఫోన్ లాక్కొని పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపించాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి పీఈఎస్ కళాశాల 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆదిత్య ప్రభు (19)గా గుర్తించామని బెంగళూరు పోలీసులు తెలిపారురు. ఆదిత్య ప్రభు అనే బీఈ విద్యార్థి పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా కాపీ కొట్టేవాడు. ఈ సమయంలో కళాశాల లెక్చరర్ మొబైల్ ఫోన్ తీసుకుని బయటకు పంపించాడు. అంతే కాకుండా కాలేజ్ లెక్చరర్ విద్యార్థి ఆదిత్య ప్రభు తల్లికి ఫోన్ చేసి నీ కొడుకు కాపీయింగ్ కు పాల్పడ్డాడని చెప్పారు.

తనకు కాలేజ్ విద్యార్థుల ముందు అవమానం జరిగిందని, మా ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పారని మనస్తాపానికి గురైన విద్యార్థి ఆదిత్య ప్రభు కళాశాల ఎనిమిదో అంతస్తు మీదకు వెళ్లి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరువు పోయిందని ఆదిత్య ప్రభు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఆదిత్య ప్రభు మంగళూరుకు చెందినవాడు. బీఈ రెండో సెమిస్టర్‌లో చదువుతున్నాడని పోలీసులు అన్నారు.
అయితే పరీక్షలో చోటుచేసుకున్న ఘటన వల్లే ఆదిత్య ప్రభు ఆత్మహత్య చేసుకున్నాడని కచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆదిత్య ప్రభు తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. ఆదిత్య ప్రభు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని సౌత్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ తెలిపారు.












Click it and Unblock the Notifications