Fighting: సైలెంట్ గా లేపేసిన ప్రత్యర్థులు, గ్యాంగ్ వార్, హిజాబ్ టైమ్ లో మరోసారి రిపిట్, వెంటాడి!
బెంగళూరు/శివమొగ్గ: యువకులు మద్య విబేధాలు రావడంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ఇంతకాలం ఒకరి మతాల గురించి ఒకరు రగిలిపోతూ లోపలలోపల వాళ్లపని వాళ్లు చేసుకుంటున్న గొడవలు అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఒక మతం గురించి ఓ మతం వాళ్లు చులకనగా మాట్లాడుతున్నారని, అవహేళనగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఇంతకాలం లోపలలోపల రగలిపోయారు. కొందరు పెద్దలు, పోలీసులు, స్థానికులు ఇంతకాలం రెండు వర్గాల యువకులకు బుద్దిమాటలు చెబతూ కంట్రలో చేస్తూ వచ్చారు.
ఎవరు ఎన్ని చెప్పినా మాతీరుమాదే అంటూ రెండు వర్గాల వాళ్లు గొడవలు చేసుకున్నారు. కొన్ని రోజులుగా రెండు వర్గాల వారు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ప్రత్యర్థులు దాడి చేస్తే ఎదురుదాడి చెయ్యాడానికి రెండు వర్గాల వాళ్లు రెడీగా ఉన్నారు. అయితే ఓ వర్గంలోని యువకులు పని ముగించుకుని ఎవరిపాటికి వాళ్లు ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంలోని యువకులు, వారి అనుచరులు వెంటాడి వెంటాడి ప్రత్యర్థి వర్గంలోని యువకుడి మీద దాడి చేశారు. ప్రత్యర్థుల చేతిలో తీవ్రగాయాలైన యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మా వర్గంలోని యువకుడిని హత్య చేశారని తెలుసుకున్న యువకులు ఆసుపత్రి మీద దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రత్యర్ధులు నివాసం ఉంటున్న ఏరియా మీద రాళ్ల వర్షం కురిపించారు. ఒకవర్గం మీద మరో వర్గం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొనింది.

మాజీ సీఎం సొంత జిల్లా
కర్ణాటకలోని శివమొగ్గలో చాలాకాలం నుంచి రెండు వర్గాల మద్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సొంత నియోజక వర్గం శివమొగ్గలోని సీగేనహళ్లిలో హర్షా (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హర్షా అనే యువకుడి వర్గం, మరో వర్గం యువకుల మద్య విబేధాలు రావడంతో ఉద్దిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది.

గొడవల మ్యాటర్ తెలిసిపోయింది
ఇంతకాలం హర్షా వర్గంలోని యువకులు, మరో వర్గంలోని యువకులు ఒకరి మతాల గురించి ఒకరు రగిలిపోతూ లోపలలోపల గొడవలు చేసుకోవడంతో అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఒక మతం గురించి ఓ మతం వాళ్లు చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. హర్షా మావర్గం వాళ్ళను అవహేళనగా కించపరిచి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని మరో వర్గంలోని యువకులు ఇంతకాలం లోపలలోపల రగలిపోయారు.

బుద్దిమాటలు చెప్పినా పట్టించుకోలేదు
మత పెద్దలు, పోలీసులు, స్థానికులు ఇంతకాలం రెండు హర్షా వర్గంతో పాటు ఇరు వర్గాల యువకులకు బుద్దిమాటలు చెబతూ కంట్రలో చేస్తూ వచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా మాతీరుమాదే అంటూ రెండు వర్గాల వాళ్లు గొడవలు చేసుకున్నారు. కొన్ని రోజులుగా హర్షాతో పాటు రెండు వర్గాల వాళ్లు సైలెంట్ గా ఉండిపోయారని తెలిసింది.

వెంటాడి చంపేసిన ప్రత్యర్థులు
ప్రత్యర్థులు దాడి చేస్తే ఎదురుదాడి చెయ్యాడినికి రెండు వర్గాల వాళ్లు రెడీగా ఉన్నారు. అయితే హర్షా వర్గంలోని యువకులు పని ముగించుకుని ఎవరిపాటికి వాళ్లు ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంలోని యువకులు, వారి అనుచరులు వెంటాడి వెంటాడి ప్రత్యర్థి వర్గంలోని హర్షా మీద దాడి చేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన హర్షా ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రగాయాలైన హర్షా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఆసుపత్రిలో అద్దాలు ద్వంసం.... ఏరియాలో రాళ్లదాడి
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మా వర్గంలోని హర్షాను దారుణంగా హత్య చేశారని తెలుసుకున్న యువకులు శివమొగ్గలోని మొగ్గాన్ ఆసుపత్రి మీద దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రత్యర్ధులు నివాసం ఉంటున్న ఏరియా మీద హర్షా వర్గంలోని యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఇదే సమయంలో హర్షా వర్గం మీద మరో వర్గం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టెన్షన్..... టెన్షన్
విషయం తెలుసుకున్న సోలీసులు రంగంలోకి దిగారు. శివమొగ్గలోని ఆజాద్ నగర్ లో ఉద్రిక్త పరిస్థులు నెల కొన్నాయి. హిజాబ్ వివాదంజరుగుతున్న సమయంలోనే శివమొగ్గలో హర్షా హత్యకు గురి కావడం కలకలం రేపింది. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొనింది.












Click it and Unblock the Notifications