అధికారం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో చూసుకో సీఎం సార్!
బెంగళూరు: అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోయడమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డీ. కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హెచ్‌డీ. కుమారస్వామి నిరసనగా కూర్చొని బీజేపీకి మద్దతు ఇచ్చారు.
విధానసౌధ దగ్గర హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కావాలనే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి మాట మేరకే స్పీకర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టి ఈరోజు విపక్షాలను మట్టికరిపించబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోశారు. కర్ణాటకప్రభుత్వం చాలా నిర్లక్ష్ంగా వ్యవహరిస్తోందని అన్నారు.

దళితులను గద్దెపై కూర్చోబెడుతున్నామని అన్నారు, ఇది చిల్లర, నీచమైన కాంగ్రెస్ రాజకీయాలు అని కుమారస్వామి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి దళితుల సానుభూతి పొందేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారని కుమారస్వామి మండిపడడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అర్థం చేసుకోవాలని అన్నారు.
గత రెండు రోజులుగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ఘటబంధన్ సభకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ నాయకుల మర్యాదలు చేస్తున్నారని, ఐఏఎస్ అధికారులను సేవకులగా పని చేయిస్తున్నారని, ఇది ఇది సరికాదని కుమారస్వామి మండిపడ్డారు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ సమావేశాలకు ఐఏఎస్ అధికారులను ఉపయోగించుకున్నారని, సీనియర్ ప్రభుత్వ అధికారులు వాళ్ల అధికారాన్ని దుర్వినియోగం చేశారని హెచ్‌డీ. కుమారస్వామి ఆరోపించారు
అెసెంబ్లీ సమావేశాల్లో జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చ జరపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతిష్టతో మేం చేసిన పని కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరించారు. ఇంతకుముందు మనం అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను ఎలాంటి ఉన్నత వర్గాలకు సేవ చేసేందుకు ఉపయోగించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాంటి నీచమైన పనులు మేము ఎప్పుడు చెయ్యలేదని అన్నారు.
2018లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ప్రముఖులను స్వాగతించడానికి నేను అధికారులను ఉపయోగించలేదని కుమారస్వామి అన్నారు. వాటిని ఉన్నతవర్గాలకు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నేను ఎలాంటి మర్యాద ఉల్లంఘనకు పాల్పడలేదని, అధికారులను ఎవరి ముందు గుంజీలీ తీయించలేదని, అధికారులను బానిసలుగా పంపలేదు కుమారస్వామి అన్నారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని,. ప్రత్యర్థి పార్టీలను ఆయన ఆరోపించారు. బీజేపీతో కలిసి సిద్దరాయయ్య ప్రభుత్వం మీద పోరాడుతున్నాం., కొందరు మంత్రులు శాసనసభ్యులను భయపెట్టే పని చేశారు.. మిమ్మల్ని సభలోనే ముగించేస్తామని బెదిరించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. స్పీకర్ యూటీ ఖాదర్ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని, స్పీకర్ అంటే సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని బీజేపీ ఎమ్మెల్యే ఆర్, మాజీ ఉప ముఖ్యమంతులు ఆర్.. అశోక్,, అశ్వత్్ నారాయణ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications