మాజీ ప్రధాని ఫ్యామిలీలో ‘పాన్ ఇండియా క్లైమాక్స్’, శుకుని క్యారెక్టర్లు ఎక్కువైనాయి, మాజీ సీఎం!
బెంగళూరు/హాసన్: ఆయన భారత మాజీ ప్రధాని. మాజీ ప్రధాని కుమారుడు మాజీ సీఎం, మరో కొడుకు మాజీ మంత్రి, ఆ ఇంటిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అలాంటి ఫ్యామిలీలో ఓ ఎమ్మెల్యే సీటు విషయంలో నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. అయితే తగ్గేదే లే అంటూ ఎవరికి వారు పట్టువిడవకపోవడంతో మ్యాటర్ పాన్ ఇండియా క్లైమాక్స్ టైపులో రచ్చరచ్చ అయ్యింది.
మాజీ ప్రధాని దేవేగౌడ సొంత పార్టీకి అన్ని ఆ కుటుంబ సభ్యులే అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ ఫ్యామిలీ ఇద్దరు ఎంపీలు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటిది హాసన్ అసెంబ్లీ టిక్కెట్ విషయంలో మాజీ సీఎం హెచ్.డీ, కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ భార్య భవాని రేవణ్ణల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది.

ఇప్పటికే హాసన్ టిక్కెట్ జేడీఎస్ కార్యకర్త స్వరూప్ కు ఇస్తామని మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. హాసన్ టిక్కెట్ తన భార్య భవానికి ఇవ్వకపోతే ఆమె స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ప్రకటించారు, నా భార్య భవానికి హాసన్ టిక్కెట్ ఇవ్వకపోతే తనకు హళేనరసీపుర టిక్కెట్ అవసరం లేదని, తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు హాసన్ లో జేడీఎస్ పార్టీ అభ్యర్థి స్వరూప్, మాజీ ప్రధాని కోడలు భవాని రేవణ్ణ పోటాపోటీగా నామినేషన్ వెయ్యడానికి డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కథనం ప్రచురించడం హాట్ టాపిక్ అయ్యింది. ఏప్రిల్ 14వ తేదీన ఒకరు, ఏప్రిల్ 17వ తేదీన ఒకరు హాసన్ లో నామినేషన్లు వెయ్యడానికి స్వరూప్, భవాని రేవణ్ణ సిద్దం అయ్యారని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.
ఒకే నియోజక వర్గంలో జేడీఎస్ దళపతి దేవేగౌడ ఆశీస్సులతో ఓ కార్యకర్త, పోటా పోటీగా మాజీ ప్రధాని దేవేగౌడ కోడలు భవాని రేవణ్ణ నామినేషన్లు వెయ్యడానికి సిద్దం కావడంతో హాసన్ లో ఓకే పార్టీ కార్యర్తల్లో టెన్షన్ మొదలైయ్యింది. సుమారు 30 వేల మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వెయ్యాలని స్వరూప్ ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.
అంతకంటే ఎక్కువ మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వెయ్యాలని భవాని రేవణ్ణ డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ విషయంలో మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ హాసన్ లో శకునులు ఎక్కువ అయ్యారని, మహాభారతంలో శకుని పాత్రలు పోషించిన లాంటి వాళ్లు తన సోదరుడు రేవణ్ణకు బ్రైన్ వాష్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
హాసన్ లోని కొంత మంది శకునులు మా ఫ్యామిలీని విడగొట్టి రాజకీయంగా లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి మండిపడుతున్నారు. అయితే హాసన్ జేడీఎస్ టిక్కెట్ విషయంలో మాజీ ప్రధాని హెచ్ డీ, దేవేగౌడ ఫ్యామిలీలో కథ పాన్ ఇండియా క్లైమాక్స్ కు చేరుకుంటున్నదని జేడీఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications