Girls: స్వామీజీకి దెబ్బ మీదదెబ్బ, హాస్టల్ లో అమ్మాయిలు మాయం, సొంతఊర్లో కూడా ?, ఏం జరుగుతోంది!
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలోని మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గాకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు అరెస్టు అయ్యి జైలకు వెళ్లడంతో ఆయన వర్గీయులు హడలిపోయారు. అమ్మాయిల లైంగిక దాడి కేసులో బెయిల్ తీసుకుని బయటకు రావాలని ప్రయత్నాలు చేసిన మురుగా మఠం శివమూర్తి మురుగా శరణరు స్వామీజీని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఒక్కరోజు తేడాలో స్వామీజీ మఠంలోని హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు కనపడకుండా పోవడం కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు స్వామీజీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఇప్పుడు మరో ఇద్దరు అమ్మాయిలు మాయం కావడంతో స్వామీజీ వర్గాయులు బిత్తరపోయారు.

స్వామీజీ మీద లైంగిక వేదింపుల కేసు
కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు రానురాను సినిమా కష్టాలు ఎదరౌతున్నాయి. స్వామీజీకి కర్ణాటకలో ఇంతకాలం మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు పెట్టడంతో కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు.

హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి కేసు పెట్టిన అమ్మాయిలు
చిత్రదుర్గా మురుగా మఠానికి చెందిన విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించారు. స్వామీజీ మీద కేసు పెట్టిన ఇద్దరు మైనర్ అమ్మాయిలు అంతకు ముందే హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి కేసు పెట్టిన విషయం తెలిసిందే.

సెంట్రల్ జైల్లో స్వామీజీ
ఇప్పటికే శివమూర్తి మురుగా శరణరు అరెస్టు కావడంతో ఆయన రిమాండ్ అవది బుధవారంతో పూర్తి అయ్యింది. బుధవారం భారీబందోబస్తు మద్య స్వామీజీని చిత్రదుర్గ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని శివమూర్తి మురుగా శరణరు కోర్టుకు మనవి చేశారు. శివమూర్తి మురుగా శరణరును 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని చిత్రదుర్గా జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇద్దరు అమ్మాయిలు మాయం
కలబురిగి జిల్లాకు చెందిన 11 ఏళ్ల అమ్మాయి, కోప్పళ జిల్లాకు చెందిన 13ఏళ్ల అమ్మాయి మురుగా మఠంలోని SIM స్కూల్ లో చదువుతూ మురుగా మఠానికి చెందిన జయదేవ హాస్టల్ లో ఉంటున్నారు. ఈనెల 8వ తేదీన ఇద్దరు అమ్మాయిలు హాస్టల్ నుంచి స్కూల్ కు బయలుదేరి వెళ్లారు. తరువాత ఇద్దరు అమ్మాయిలు మాయం అయ్యారు.

ఐదు రోజుల తరువాత కేసు ?
హాస్టల్ సిబ్బంది స్కూల్ లో విచారణ చేస్తే ఆ రోజు ఇద్దరు అమ్మాయిలు స్కూల్ కు వెళ్లలేదని తెలిసింది. అమ్మాయిలు మా ఇళ్లకు రాలేదని వాళ్ల కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఈనెల 12వ తేదీన ఇద్దరు అమ్మాయిలు కనపడటం లేదని హాస్టల్ అధికారులు చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఏం జరిగింది ?, ఎక్కడికి వెళ్లారు
అమ్మాయిలు కనపడటం లేదని కేసు నమోదు అయిన మూడు రోజుల తరువాత గురువారం ఈ విషయం వెలుగు చూసింది. ఇప్పటికే హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు స్వామీజీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఇప్పుడు మరో ఇద్దరు అమ్మాయిలు పారిపోవడంతో మురుగా మఠాధిపతి అనుచరులు హడలిపోతున్నారని సమాచారం.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications