బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు-మైసూరు హైవే వరదలోనే, మునిగిన వాహనాలు, వేలాది మందిపై ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాణ్యతా లోపం కారణంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రోడ్డు ప్రాజెక్టులు కూడా వరదనీటికి దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు నుంచి మైసూరు వరకు కలిపే ఒక మెగా ప్రాజెక్ట్ ఇటీవల కురిసిన రెయిన్ టెస్టులో విఫలమైనట్లు నిపుణులు అంటున్నారు.

జలమయమైన రోడ్లు

జలమయమైన రోడ్లు

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైవేలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా సర్వీస్ రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఇది క్లాసిక్ కేసు అని నిపుణులు చెబుతున్నారు. ముందు చూపులేని డ్రైనేజీ సౌకర్యాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. రూ. 3,501 కోట్లు (ఫేజ్-1), రూ. 2,920 కోట్లు (ఫేజ్-2) వ్యయంతో రాష్ట్రంలో అత్యంత ఖరీదైన రహదారి ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడం గమనార్హం.

హైవేపై వాహనాలు వరదలోనే..

కుంబల్ గోడు, బిడాది, రామనగర్, చన్నపట్నం సమీపంలోని కొన్ని హైవేలు శనివారం పూర్తిగా లజమయం కావడంతో వాహనాలు కదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. నిజానికి హైవేలో వరదలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కురిసిన వర్షాలకు మద్దూరు, మాండ్య సమీపంలోని రోడ్లన్నీ జలమయమై కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయ. అంతేగాక, భారీగా వరద రావడంతో పలు వాహనాలు నీట మునిగాయి.

వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం

వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం


హైవేపై వర్షం నీరు నిలవకుండా రోడ్లు నిర్మించాలి. వర్షం నీరు నిలిచి ఉంటే, అది ఖచ్చితంగా రహదారిని దెబ్బతిస్తుంది. రోడ్లు పగుళ్లు ఏర్పడి వాహన చోదకులకు ప్రమాదకరంగా మారుతాయని, వీటిని బాగు చేసేందుకు గుత్తేదారులు డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని ట్రాఫిక్ నిపుణుడు శ్రీనివాస్ తెలిపారు. వర్షపునీరు నిలిచిపోతే వాహనాలు ఢీకొని రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. ఇది చాలా ముఖ్యమైన రహదారి అయినందున రహదారిపై ఏదైనా ఆటంకం ఏర్పడితే వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడుతుంది. వారు చివరికి గంటల తరబడి చిక్కుకుపోతారన్నారు.

భారీ వర్షంతో ప్రాజెక్టు లోపం తేలిపోయింది

భారీ వర్షంతో ప్రాజెక్టు లోపం తేలిపోయింది

ఒక ప్రాజెక్టు పూర్తయిందని, రహదారి బాగా కనిపిస్తుందని.. అయితే వర్షాలు కురిసన తర్వాతే అసలు పరిస్థితి బయటపడుతుందని మరో ట్రాఫిక్ నిపుణుడు ఆనంద్ తెలిపరాు. అదృష్టవశాత్తూ ఇప్పుడు రోడ్డు పూర్తికాకముందే బహిర్గతమైందని, భవిష్యత్తులో హైవేపై నీటి ఎద్దడి ఉండకుండా అధికారులు లొసుగులను సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటున్న మాజీ సీఎం

కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటున్న మాజీ సీఎం

ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉందని, డ్రైన్ నెట్ వర్క్‌లకు రోడ్ల అనుసంధానం పురోగతిలో ఉందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు. కాలువలు అనుసంధానించబడిన తర్వాత స్తబ్ధత తగ్గుతుందని నివేదించారు. కాగా, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఈ ప్రాజెక్టు పరిస్థితిపై మాట్లాడుతూ.. తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నానని, ఇప్పుడు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో పర్యటిస్తూ రోడ్డు పనుల నాణ్యతా లోపంపై కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలిసి సమస్యను లేవనెత్తనున్నట్లు తెలిపారు.

బెంగళూరులో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, అలర్ట్

బెంగళూరులో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, అలర్ట్


నైరుతి రుతుపవనాలు అంతర్గత కర్ణాటకలో, కోస్తా కర్ణాటకలో బలహీనంగా ఉన్నాయి. బెంగళూరులో వచ్చే రెండు రోజులు సాధారణంగా మేఘావృతమైన ఆకాశంతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టంగా 27, 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో బెంగళూరు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పలు మార్గాల్లో రైళ్లు కూడా పట్టాలపైకి వరద నీరు రావడంతో నిలిచిపోయాయి.

English summary
heavy rains: Bengaluru-Mysuru Road failed in ‘rain test’, vehicles in floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X