బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Techie: నా భార్య నన్ను చంపేస్తోంది, మీరే నన్ను రక్షించండి, ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిన టెక్కీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న టెక్కీ అతని భార్యతో సంతోషంగా జీవించాలని ఊహించుకున్నాడు. అయితే టెక్కీ ఊహించుకున్న కాపురం రివర్స్ అయ్యింది. భార్య తీరుతో విసిగిపోయిన టెక్కీ నా భార్య నుంచి మీరే నన్ను రక్షించాలి సార్ అంటూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి లేఖ రాశాడు. ప్రధాని మోదీ కార్యాలయంతో పాటు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్, కేంద్ర మంత్రికి ట్యాగ్ చేస్తూ టెక్కీ లేఖ అటాచ్ చేశాడు.

నా భార్య నన్ను కచ్చితంగా చంపేస్తుంది, ఇప్పటికే నా ప్రాణాలతో చెలగాటం ఆడింది, ఇప్పటికే కత్తితో నా మీద అనేకసార్లు దాడి చేసింది, నన్ను మీరే కాపాడండి అంటూ టెక్కీ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Lovers: రివర్స్ గేర్ వేసిన గిరిష్మా, బ్లాక్ మెయిల్ చేశాడని లేపేశాను, కోటీశ్వురుడిని పెళ్లి చేసుకోవాలని Lovers: రివర్స్ గేర్ వేసిన గిరిష్మా, బ్లాక్ మెయిల్ చేశాడని లేపేశాను, కోటీశ్వురుడిని పెళ్లి చేసుకోవాలని

బెంగళూరులో టెక్కీ కాపురం

బెంగళూరులో టెక్కీ కాపురం

బెంగళూరులో యదునందన్ ఆచార్య అలియాస్ యదునందన్ అలియాస్ ఆచార్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యదునందన్ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న టెక్కీ యదునందన్ అతని భార్యతో సంతోషంగా జీవించాలని ఊహించుకున్నాడు. అయితే టెక్కీ యదునందన్ ఊహించుకున్న కాపురం రివర్స్ అయ్యింది.

ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ

భార్య తీరుతో విసిగిపోయిన టెక్కీ నా భార్య నుంచి నన్ను మీరే రక్షించాలి సార్ అంటూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి (పీఎంఓ)కు ట్విట్టర్ లో లేఖ రాసి పీఎంఓ ఆఫీసు అకౌంట్ కు ట్యాగ్ చేశాడు. నా భార్య పెద్ద శాడిస్టు ప్రతిరోజు నన్ను హింసిస్తోంది, ఏది చిక్కితే దానితో చితనబాదుతోంది, మీరు నారీ శక్తి అని మహిళలను ఉత్తేజపరుస్తున్నారు, నారీ శక్తి అంటే ఇదేనా స్వామీ అంటూ టెక్కీ యదునందన్ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో విచారంవ్యక్తం చేశాడు.

పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి లెటర్ అటాచ్

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి రాసిన లేఖను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. నన్ను మీరే కాపాడండి, నా భార్య నన్ను కచ్చితంగా చంపేస్తుంది, ఇప్పటికే నా ప్రాణాలతో చెలగాటం ఆడింది, అనేకసార్లు కత్తితో నా మీద దాడి చేసింది, నన్ను మీరే కాపాడండి అంటూ టెక్కీ యదునందన్ పీఎంఓ ఆఫీసు, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మీరు వచ్చి మీ భార్య మీద ఫిర్యాదు చెయ్యండి

మీరు వచ్చి మీ భార్య మీద ఫిర్యాదు చెయ్యండి

టెక్కీ యదునందన్ కు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి నుంచి రిప్లే వచ్చింది. మీరు మొదట పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీ భార్య మీద ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సమాచారం అందింది. గతంలో కూడా తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నానని టెక్కీ యదునందన్ పోలీసులకు రిప్లే ఇచ్చాడు. మొత్తం మీద టెక్కీ యదునందన్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
Help: Techie complained office of the Prime Minister PMO seeking protection from his wife in Bengaluru city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X