Heroines: డ్రగ్స్ కేసు దెబ్బ, సెంట్రల్ జైల్లో రాగిణి, సంజనాలను ఎంత మంది కలిశారో తెలుసా ?, కలికాలం !

బెంగళూరు/ ఎలక్టానిక్ సిటి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల పరిస్థితి దీనంగా తయారైయ్యింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో మొదట అరెస్టు అయిన రాగిణి, తరువాత అరెస్టు అయిన నటి సంజనాలు సెంట్రల్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. డ్రగ్స్ కేసులో పక్కా ఆధారాలతో చిక్కిపోయిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేదు. అయితే పరప్పన అగ్రహార సెంట్రల్ కు రాగిణి వెళ్లి 50 రోజులు, సంజనా వెళ్లి 45 రోజులు అవుతోంది. జైల్లో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను ఎవరెవరు కలిశారు ? అనే విషయంపై జైళ్ల శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

రాగిణి VS సంజనా

రాగిణి VS సంజనా


బెంగళూరు డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నువ్వానేనా అంటూ పొట్లాడుకుంటున్నారని ఇప్పటికే వెలుగు చూసింది. డ్రగ్స్ కేసులో అరెస్టు కాకముందే రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటుందని స్యాండిల్ వుడ్ వర్గ ప్రముఖులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కాలం కలిసిరాకపోవడంతో జైల్లో ఉంటున్న రాగిణి, సంజనాలు ఒక్కటి అవుతారో ? లేదో ? కాని వారి పరిస్థితి జైల్లో దయనీయంగా ఉందని వెలుగు చూసింది.

 ఈడీ అధికారుల దెబ్బ

ఈడీ అధికారుల దెబ్బ


బెంగళూరు డ్రగ్స్ దందా కేసు వెలుగు చూసిన తరువాత ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, రాహుల్, వీరేన్ ఖన్నా, బీకే. రవిశంకర్ తదితరులు ఈడీ అధికారుల కళ్లలో పడ్డారు. డ్రగ్స్ దందాతో వీరు భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. హీరోయిన్లు రాగిణి, సంజనా, రాహుల్, వీరేన్ ఖన్నా, రవిశంకర్ ల అక్రమ ఆస్తుల విషయంపై ఈడీ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీశారు. రాగిణి, సంజనాలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారణ చేసి వివరాలు సేకరించారు.

 బెయిల్ ఇవ్వండి మహాప్రభో

బెయిల్ ఇవ్వండి మహాప్రభో

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ హనీ రాగిణి ద్వివేది, బహుబాష నటి సంజనా గల్రానీతో పాటు ఇంతకాలం డ్రగ్స్ సేవించి జల్సాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, వీరేన్ ఖన్నా, బీకే, రవిశంకర్ తదితరులు తమకు బెయిల్ మంజూరు చెయ్యాలని వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంత వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏ ఒక్కరికి బెయిల్ మంజూరు కాలేదు.

 జైల్లో హీరోయిన్ల పరిస్థితి ?

జైల్లో హీరోయిన్ల పరిస్థితి ?

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు నటి రాగిణి, సంజనాలలకు బెయిల్ రాకపోవడంతో గత నెలలోనే ప్రత్యేక సెల్ నుంచి సాధారణ ఖైదీలు ఉండే బ్యారెక్ లకు తరలించారు. అప్పటి నుంచి ఇంతకాలం సెలబ్రిటీలుగా చాలమణి అయిన రాగిణి, సంజనాలు ఇప్పుడు సాధారణ ఖైధీలతో కలిసి కాలం గడుపుతున్నారు.

 రాగిణి, సంజనాలను ఎంతమంది కలిశారు ?

రాగిణి, సంజనాలను ఎంతమంది కలిశారు ?

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న హీరోయిన్లు రాగిణి, సంజనాలను ఇన్ని రోజులు ఎవరెవరు కలిశారు ? అనే సమాచారం ఇవ్వాలంటూ ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద జైళ్ల శాఖ అధికారులకు మనవి చేశారు. ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి సెప్టెంబర్ 25వ తేదీన కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాయగా అక్టోబర్ 12వ తేదీన అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు.

రాగిణి, సంజనాలకు నో ఫ్యాన్స్ !

రాగిణి, సంజనాలకు నో ఫ్యాన్స్ !

సెప్టెంబర్ 4వ తేదీన నటి రాగిణి, సెప్టెంబర్ 8వ తేదీన నటి సంజనా గల్రానీలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి అయిన తరువాత రాగిణి, సంజనాలను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు హీరోయిన్లు రాగిణి, సంజనాలను చూడటానికి ఒక్కరు కూడా జైలుకు రాలేదని జైళ్ల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి మీడియాకు చెప్పారు.

Recommended Video

    Ragini Dwivedi, Sanjjanaa Galrani Case Update | Oneindia Telugu
    కాలం మారిపోయింది పాపం

    కాలం మారిపోయింది పాపం


    ఇంతకాలం ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లో, ఫోటోలకు, సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన హీరోయిన్లు రాగిణి, సంజనాలను చూడటానికి ఒక్కరు కూడా సెంట్రల్ జైలుకు వెళ్లలేదని వెలుగు చూడటంతో అందరూ షాక్ కు గురైనారు. కరోనా వైరస్ కారణంగా నటి రాగిణి, సంజనాలు ఎవ్వరినీ కలవలేదని జైళ్లు శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. మొత్తం మీద డ్రగ్స్ కేసు పుణ్యామా అంటూ రాగిణి, సంజనాలను చూడటానికి ఏ ఒక్క అభిమాని కూడా వెళ్లలేదని వెలుగు చూడటంతో స్యాండిల్ వుడ్ వర్గాలు సైతం షాక్ కు గురైనాయని తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+