బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab Row: ఆ రోజు వరకు కాలేజ్ లు క్లోజ్, హిజాబ్, కాషాయం, మధ్యలో లవర్స్ డే పంచాయితి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిజాబ్ వివాదంతో కర్ణాటకలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇంతకాలం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయిన విద్యార్థులు ఇటీవలే విద్యాసంస్థల ముఖం చూశారు. అయితే హిజాబ్, కాషాయం కండువాల వివాదం దెబ్బతో మరోసారి విద్యాసంస్థలు మూతపడ్డాయి. హిజాబ్, కాషాయం కండువాల వివాదం పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కాలేజ్ లు మూసివేయాలని కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలా ?, వద్దా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. విద్యాసంస్థల్లో మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించడానికి వీలు లేదని ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇక హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన ఉడిపిలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు, సాయుధ బలగాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం అయితే మా పిల్లలను స్కూల్స్, కాలేజ్ లకు పంపించాలా ? వద్దా ? అనే విషయంలో కొందరు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.

Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు!Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు!

హిజాబ్, కాషాయం కండువాలు వద్దు

హిజాబ్, కాషాయం కండువాలు వద్దు

కర్ణాటకలోని ఉడిపి రాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ అమ్మాయిలు హిజాబ్ ధరించకూడదని సూచించారు. ఉడిపి కాలేజ్ ప్రిన్సిపల్ దేశాలను సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాలేజ్ ల్లో హిజాబ్, బుర్కాలు, కాషాయ కండువాలు ధరించకూడదని, కాలేజ్ యూనిఫామ్ మాత్రం వేసుకోవలని కర్ణాటక హైకోర్టు సూచించింది. హిజాబ్, కాషాయ కండువాల వివాదం ముందు పెట్టుకుని ఎవ్వరూ శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడాదని కర్ణాటక హైకోర్టు సూచించింది.

 మేము మొత్తం గమనిస్తున్నాము

మేము మొత్తం గమనిస్తున్నాము

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కొందరు కాలేజ్ అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము పరిశీలిస్తున్నామని, ఇది జాతీయ స్థాయి వివాదం కాదు, దీనిని జాతీయ స్థాయి వివాదం చెయ్యకూడదని అత్యవసర పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు సూచంచింది.

సరైన సమయంలో జోక్యం చేసుకుంటాము

సరైన సమయంలో జోక్యం చేసుకుంటాము

మీరు ఈ విషయ్యాన్ని జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరించకూడదని అమ్మాయిల తరుపు వాదిస్తున్న పిటిషనర్ తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదాన్ని ఢిల్లీ వరకు తీసుకురావడం సరైనదేనా ?, తప్పు జరిగితే మేము జోక్యం చేసుకుంటాము కాదా, మీరే ఆలోచించిండి అంటూ సుప్రీం కోర్టు అమ్మాయల తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఎవరి భయం వాళ్లదే

ఎవరి భయం వాళ్లదే

కాలేజ్ విద్యార్థుల్లో హిజాబ్, కాషాయం కండువాల విషయంలో తేడాలు రావడంతో చాలా మంది కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలను విద్యాసంస్థలకు పంపించడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం అయితే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అంటూ కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు

ఇలాంటి సమయంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడానికి పోలీసులు, సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ గొడవలు మొదలైన ఉపిడి జిల్లాతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, సాయుధ బలగాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటూ సామాన్య ప్రజలకు పోలీసులు ధైర్యం చెబుతున్నారు.

విద్యాసంస్థలు 16వ తేదీ వరకు క్లోజ్

విద్యాసంస్థలు 16వ తేదీ వరకు క్లోజ్

హైకోర్టులో పిటిషన్ల విచారణ పూర్తి అయ్యే వరకు విద్యార్థులు ఎవ్వరూ కూడా హిజాబ్ లు ధరించి విద్యాసంస్థలకు రాకూడదని, కాషాయం కండువాలు వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లకూడాదని ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాసంస్థలు ప్రారంభించాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ వరకు విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏం జరుగుతోంది అని ఆరా తీసిన సీఎం

ఏం జరుగుతోంది అని ఆరా తీసిన సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పోలీసు అధికారులు, విద్యాశాఖా అధికారులతో సమావేశం నిరహించి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. హిజాబ్ వివాదం సర్దుమనిగే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. జిల్లా పోలీసు అధికారులు వారివారి జిల్లాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, శాంతి భద్రతలు కాపాడాలని కర్ణాటక హోమ్ మంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Hijab పై స్పందించిన PM Modi|UP Elections 2022| Rahul Gandhi On Modi’s Remark | Oneindia Telugu
ఆన్ లైన్ క్లాసులు?

ఆన్ లైన్ క్లాసులు?

హిజాబ్, కాషాయం కండువాల వివాదం పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరి 16వ తేదీ వరకు విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలా ?, వద్దా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. మొదట కాలేజ్ లు ఫిబ్రవరి 14వ తేదీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేసిందని సమాచారం. అయితే ఇప్పుడున్న రామాయణాలకు తోడు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో కొన్ని సంఘాలు పార్క్ లు, ఏకాంత ప్రదేశాల్లో ప్రేమికుల మీద విరుచుకుపడితే మరో తలనొప్పి అవుతోందని కొందరు ప్రభుత్వానికి సలహా ఇవ్వడంతో ఫిబ్రవరి 16వ తేదీకి మార్చారని తెలిసింది. గతంలో ఫిబ్రవరి 14వ తేదీన పార్క్ ల్లో, ఏకాంత ప్రదేశాల్లో కనపడితే కొన్ని సంఘాలు వారికి పెళ్లి చేసిన సంఘటలు వెలుగు చూశాయి.

English summary
Hijab Row: Karnataka government announced that colleges under the Higher Education Department will stay shut till Wednesday, February 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X