Hijab row: బుర్కాల వివాదం, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు, ఎమ్మెల్యేకి ఏం సంబంధం !
బెంగళూరు/ఉడిపి: ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు బుర్కాలు ( హిజాబ్) వేసుకుని కాలేజ్ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఉడిపి ఎమ్మెల్యేకి, ఉడిపి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో ప్రిన్సిపాల్, ఆ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు హైకోర్టును ఆశ్రయించారు. మమ్మల్ని బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి రాకూడాదని ప్రిన్సిపాల్, కాలేజ్ సిబ్బంది అడ్డుకుంటున్నారని, మా మనోభావాలు దెబ్బతినేలా వీరు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు కర్ణాటక ప్రభుత్వంతో పాటు విద్యాశాఖా ప్రధాన కార్యదర్శి, కాలేజ్ ప్రిన్సిపాల్, ఎమ్మెల్యే, లెక్సరర్స్ కు, విద్యాశాఖా అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు బుర్కా (హిజూబ్) ధరించి కాలేజ్ కు రాకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల నుంచి బుర్కాలు వేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
జైశ్రీరామ్ నినాదాలు
కాలేజ్ లో చదవే అమ్మాయిలు బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని కాలేజ్ లోకి వెళ్లి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తామని కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు మొండికేయడం కలకలం రేపింది. కాలేజ్ ప్రిన్సిపాల్ తో ముస్లీం అమ్మాయిలు వాగ్విదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన ముస్లీం అమ్మాయిలు
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ఆయేషా హజీరా అల్మాస్, రేషమ్ ఫారుక్, ఆలియా అస్సాది, శఫా, షమీమ్, ముస్తఫా జైనబ్ తదితరుల తరపున న్యాయవాది మోహమ్మద్ తాహీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కాలేజ్ విద్యార్థినిలు సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన న్యాయమూర్తి కృష్ణ ఎస్. దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ కర్ణాటక ప్రభుత్వంతో పాటు సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు అందరికి నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్యే, విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాల్ కు నోటీసులు
ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్, ప్రాథమిన, ప్రౌడశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్, ఉడిపి జిల్లా విద్యాశాఖ డైరెక్టర్, కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ, వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్ శర్మాతో పాటు అదే కాలేజ్ లో పని చేస్తున్న పలు విభాగాల అధ్యాపకులతో పాటు మొత్తం 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.
Recommended Video

ఎమ్మెల్యే జోక్యం ఎక్కువ అయ్యిందని ఆరోపణలు
ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్ (బీజేపీ) ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని కొందరు అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో హిజాబ్ (బుర్కా) వివాదంతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications