Hijab Row: స్కూల్స్ దగ్గర 144 సెక్షన్, బుర్కాల వివాదం, కాలేజ్ విషయంలో ఆ రోజు డిసైడ్ చేస్తాం!
బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదంతో కర్ణాటకలో విద్యాసంస్థలు ఇన్ని రోజులు మూతపడ్డాయి. కొంతకాలంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయిన విద్యార్థులు ఇటీవలే విద్యాసంస్థల ముఖం చూశారు. అయితే హిజాబ్, కాషాయం కండువాల వివాదం దెబ్బతో ఇటీవల మరోసారి విద్యాసంస్థలు మూతపడ్డాయి. హిజాబ్, కాషాయం కండువాల వివాదం పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కాలేజ్ లు మూసివేయాలని కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీన కర్ణాటకలో హైస్కూల్ వరకు చదివే విద్యార్థులు విద్యాసంస్థల్లో అడుగు పెట్టారు. హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన ఉడిపితో సహ కర్ణాటకలోని అన్ని విద్యాసంస్థల దగ్గర ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19వ తేదీ అర్దరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

హిజాబ్ వివాదం.... శాంతిని కాపాడాలని చెప్పిన హైకోర్టు
కర్ణాటకలోని ఉడిపి కాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ అమ్మాయిలు హిజాబ్ ధరించకూడదని సూచించారు. ఉడిపి కాలేజ్ ప్రిన్సిపల్ దేశాలను సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాలేజ్ ల్లో హిజాబ్, బుర్కాలు, కాషాయ కండువాలు ధరించకూడదని, కాలేజ్ యూనిఫామ్ మాత్రం వేసుకోవలని కర్ణాటక హైకోర్టు సూచించింది. హిజాబ్, కాషాయ కండువాల వివాదం ముందు పెట్టుకుని ఎవ్వరూ శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడాదని కర్ణాటక హైకోర్టు సూచించింది.

సుప్రీం కోర్టు వరకు వెళ్లిన అమ్మాయిలు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కొందరు కాలేజ్ అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము పరిశీలిస్తున్నామని, ఇది జాతీయ స్థాయి వివాదం కాదు, దీనిని జాతీయ స్థాయి వివాదం చెయ్యకూడదని అత్యవసర పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు సూచించింది.
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదాన్ని ఢిల్లీ వరకు తీసుకురావడం సరైనదేనా ?, తప్పు జరిగితే మేము జోక్యం చేసుకుంటాము కాదా, మీరే ఆలోచించిండి అంటూ సుప్రీం కోర్టు అమ్మాయల తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది.

హడలిపోతున్న తల్లిదండ్రులు
కాలేజ్ విద్యార్థుల్లో హిజాబ్, కాషాయం కండువాల విషయంలో తేడాలు రావడంతో చాలా మంది కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలను విద్యాసంస్థలకు పంపించడానికి వెనుకాముందు ఆలోచిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయని, ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అంటూ కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇప్పటికీ అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిస్కూల్ దగ్గర 144 సెక్షన్
హిజాబ్, కాషాయం కండువాల వివాదం జరుగుతున్న సమయంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడానికి పోలీసులు, సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ గొడవలు మొదలైన ఉపిడి జిల్లాతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, సాయుధ బలగాలు ఇప్పటికే రోజూ మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నాయి. మీరు ధైర్యంగా ఉండాలి, మీ పిల్లలకు మేము అండగా ఉంటామని విద్యార్థుల కుటుంబ సభ్యులకు, సామాన్య ప్రజలకు పోలీసులు ధైర్యం చెబుతున్నారు. ఉడిపితో పాటు కర్ణాటకలోని అన్ని విద్యాసంస్థల దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

ఏం జరుగుతుందో చూసి కాలేజ్ ల విషయంలో డిసైడ్
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాసంస్థలు ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ వరకు విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
ఫిబ్రవరి 14వ తేదీన కర్ణాటకలో హైస్కూల్ వరకు చదివే విద్యార్థులు విద్యాసంస్థల్లో అడుగు పెట్టారు. హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన ఉడిపితో సహ కర్ణాటకలోని అన్ని విద్యాసంస్థల దగ్గర ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19వ తేదీ అర్దరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications