lady lawyer: ప్రభుత్వ లాయర్, మేడమ్ ఒక్క కేసు డీల్ చెయ్యడానికి ఎన్ని లక్షలు ఇవ్వాలంటే, దెబ్బకు?
ఫోక్సో కేసులో అరెస్టు అయిన వ్యక్తికి సహకరించడానికి భారీ మొత్తంలో లేడీ లాయర్ లంచం తీసుకుంది. బ్యాలెన్స్ డబ్బుల కోసం ఖాళీ చెక్ తో పాటు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న లేడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్డంగా చిక్కిపోయింది.
బెంగళూరు: ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తున్న మహిళకు మరో భాద్యత అప్పగించారు. ఫోక్సో కేసులను ప్రభుత్వం తరపున వాదించడానికి ఆమెకు అవకాశం ఇచ్చారు. కుటుంబ గొడవలు తరపున వాదించడానికి, ఫోక్సో కేసుల తరపున వాదించడానికి మహిళా లాయర్ కు ప్రభుత్వం జీతం కూడా ఇస్తోంది. ఫోక్సో కేసులో అరెస్టు అయిన వ్యక్తికి సహకరించడానికి భారీ మొత్తంలో లేడీ లాయర్ డబ్బులు డిమాండ్ చేశారు.
ఇప్పటికే లేడీ లాయర్ లక్ష డబ్బులు తీసుకున్నారు. బ్యాలెన్స్ డబ్బుల కోసం ఖాళీ చెక్ తో పాటు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న లేడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్డంగా అధికారులకు చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫోక్సో కేసులో నిందితుడికి?
ఫోక్సో కేసులో నిందితుడికి సహకరించేందుకు రూ.1. 87 లక్షలు లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది లోకాయుక్త అధికారులకు అడ్డంగా చిక్కిపోయింది. లంచంతో పాటు డబ్బుకు గ్యారెంటీగా సంతకం చేసిన ఖాళీ చెక్కుతో పాటు లేడీ పీపీ లోకాయుక్త వలలో చిక్కిన సంఘటన కర్ణాటకలోని దావణగెరె నగరంలో చోటుచేసుకుంది.

రూ. 3 లక్షలు లంచం డిమాండ్
దావణగెరె జిల్లా ఫోక్సో కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్న రేఖా ఎస్. కోటగౌదర్ అలియాస్ రేఖా లంచం డబ్బుతో పాటు నిందితులు సంతకం చేసిన బ్లాంక్ చెక్‌తో పాటు లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డారు. ఫోక్సో కేసులో నిందితుడికి సాయం చేసేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా రూ. 3 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అడ్వాన్స్ గా లక్షల్లోనే లంచం ఇచ్చారు
కర్ణాటకలోని దావణగెరె తాలూకా కిత్తూరు గ్రామానికి చెందిన జిటి మదన్ కుమార్ అలియాస్ మదన్ మీద కిత్తూరులో మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు మదన్ కుమార్‌కు సాయం చేసేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా రూ.3 లక్షలు డిమాండ్ చేసింది.
ఇప్పటికే రేఖాకు రూ.1. 13 లక్షలు అందాయి. ఈ కేసులో సాయం చేసేందుకు తాను చెల్లించాల్సిన రూ.1. 87 లక్షల మొత్తానికి గ్యారెంటీగా నిందితుడు మదన్ కుమార్ తన నుంచి కర్ణాటక బ్యాంకుకు చెందిన సంతకంతో కూడిన ఖాళీ చెక్కును అందుకున్నాడు.

మేడమ్ మీద ఫిర్యాదు చేసిన బాధితుడు
లంచం ఇవ్వాలని రేఖా మేడమ్ పదేపదే ఒత్తిడి చెయ్యడంతో ఆ కేసులోని నిందితుడు మదన్ కుమార్ లోకాయుక్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.1.87 లక్షలు దావణగెరె పీజే బరంగయ్‌లోని ఆయన నివాసంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా కోటేగౌడర్ లంచం, ఖాళీ చెక్ తీసుకుంటున్న సమయంలో ఆమెను లోకాయుక్త అధికారులకు పట్టుకున్నారు. జిల్లా సెషన్స్ అండ్ స్పెషల్ కోర్టు, ఫోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్న రేఖా మదన్ కుమార్ నుంచి బ్లాంక్ చెక్ తీసుకుంటున్నర సమయంలో అరెస్టు చేశామని లోకాయుక్త పోలీసులు తెలిపారు
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications