Illegal affair: వివాహిత మహిళతో యువకుడి అక్రమ సంబంధం, జల్సాలు, సీన్ కట్ చేస్తే ఇద్దరి శవాలు!

బెంగళూరు/మైసూరు: వివాహం చేసుకున్న మహిళ కొన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసి తరువాత అతన్ని వదిలేసింది. వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న యువకుడికి, భర్తను వదిలేసిన మహిళకు పరిచయం అయ్యింది. కొంతకాలం చనువుగా ఉన్న ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. రెండు మూడు నెలలకు ఒకసారి కొన్ని రోజులు ఇద్దరూ విహారయాత్రలకు వెళ్లి జల్సా చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భార్య అతన్ని నిలదీసింది. పెద్దలతో భార్య ఇప్పటికే పంచాయితీలు పెట్టించింది.

అయితే ఎవరు ఎన్ని చెప్పినా అతను మాత్రం ప్రియురాలిని వదులుకోవడానికి నిరాకరించాడు. ఎప్పటిలాగే ప్రియురాలితో కలిసి నాలుగు రోజులు ముందు బయటకు వెళ్లాడు. తరువాత ప్రియురాలు శవమై కనిపించడం, పక్కనే ప్రియుడు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భర్తకు దూరంగా ఉంటున్న మహిళ

భర్తకు దూరంగా ఉంటున్న మహిళ

కర్ణాటకలోని మైసూరు జి్లాలోని టీ నరసీపుర తాలుకాకు చెందిన సుమిత్రా అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న సుమిత్రా కొన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసి తరువాత అతన్ని వదిలేసింది. భర్తను వదిలేసిన సుమిత్రా ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది.

లేడీతో టచ్ లోకి వెళ్లిన సిద్దరాజు

లేడీతో టచ్ లోకి వెళ్లిన సిద్దరాజు

మైసూరు జిల్లాలోనే సిద్దరాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇప్పటికే వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న సిద్దరాజుకు, భర్తను వదిలేసిన సుమిత్రాకు మూడు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న తరువాత చనువు పెంచుకున్న ఉన్న సిద్దరాజు, సుమిత్రా టచ్ లో ఉన్నారు.

అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలు

అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలు

మొదట ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న సుమిత్రా, సిద్దరాజు తరువాత నేరుగా కలవడం మొదలు పెట్టారు. సిద్దరాజు, సుమిత్రా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. రెండు మూడు నెలలకు ఒకసారి కొన్ని రోజులు సిద్దరాజు, సుమిత్రా ఇంటి నుంచి వెళ్లిపోయి విహారయాత్రలకు వెళ్లి జల్సా చేస్తున్నారు.

ప్రియుడు ఎవరిమాట వినలేదు

ప్రియుడు ఎవరిమాట వినలేదు

సిద్దరాజు అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భార్య అతన్ని నిలదీసింది. నువ్వు సుమిత్రా జోలికి వెలితే నీకు విడాకులు ఇస్తానని సిద్దరాజును అతని భార్య హెచ్చరించింది. పెద్దలతో ఇప్పటికే సిద్దరాజు భార్య పంచాయితీలు పెట్టించింది. విషయం లీక్ కావడంతో సిద్దరాజు సీక్రేట్ గా అతని ప్రియురాలు సుమిత్రాను కలుస్తున్నాడు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా సిద్దరాజు మాత్రం అతని ప్రియురాలు సుమిత్రాను వదులుకోవడానికి నిరాకరించాడు.

శవమైన ప్రియురాలు

శవమైన ప్రియురాలు

శనివారం ప్రియురాలు సుమిత్రాతో కలిసి సిద్దరాజు విహారయాత్రకు వెళ్లాడు. నాలుగు రోజుల తరువాత బుధవారం టీ నరసీపుర తాలుకకాలోని తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతంలో సుమిత్రా శవమై కనిపించింది. సుమిత్రా శవం పక్కనే ప్రియుడు సిద్దరాజు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

అక్రమ సంబంధానికి ఇద్దరూ బలి

అక్రమ సంబంధానికి ఇద్దరూ బలి

ప్రియురాలు సుమిత్రాను హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిద్దరాజు అతని స్నేహితుడు ఒకరికి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడని, సుమిత్రా చనిపోయింది, ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని వాయిస్ మెసేజ్ పంపించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+