Illegal affair: ప్రియుడిని లాడ్జ్ కు పిలిపించి బాత్ రూమ్ లో నరికేశారు. మరో లేడీ ఎంట్రీతో, ఫినిష్!
బెంగళూరు/ హాసన్/ కొడుగు: మహిళ వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. ఓ వ్యక్తి వివాహం చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. వివాహిత మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మహిళ, యువకుడు వేరువేరు జిల్లాల్లో నివాసం ఉంటున్నారు. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు నెలలో రెండుమూడుసార్లు కలుస్తున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల సభ్యులకు తెలిసి ఇద్దరిని హెచ్చరించారు. ప్రియుడిని పక్కాప్లాన్ తో పిలిపించిన ప్రత్యర్థులు ఓ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు.
ఇద్దరు భార్య,భర్తలు అని ఆ లాడ్జ్ లో వారు రూమ్ తీసుకున్నారు. అదే లాడ్జ్ లో ఓమహిళతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా రూమ్ లు తీసుకున్నారు. అర్దరాత్రి దాటిన తరువాత ప్రియుడు ఉన్న రూమ్ లోకి వెళ్లిన వ్యక్తులు అతన్ని బాత్ రూమ్ లో దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. ప్రియుడిని చంపేసిన తరువాత లాడ్జ్ లోని రూమ్ లు ఖాళీ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అతన్ని నేను మాత్రమే హత్య చేశానని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు.
అతనితో పాటు మరో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రియుడిని చంపేశారని పోలీసులు అంటున్నారు. హత్యకు గురైన ప్రియుడు, అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలి మొబైల్ ఫోన్ నెంబర్ల డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రియుడి హత్య కేసులో మరో లేడీ ఎంట్రీ ఇచ్చిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు
కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సోమవారపేట తాలుకాలోని 6వ హోస్ కోటే గ్రామంలో నివాసం ఉంటున్న హరీష్ (36) అనే వ్యక్తి ఓ యువతిని వివాహం చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు.

అక్రమ సంబంధం... సీక్రేట్ గా రొమాన్స్
వివాహిత మహిళ స్వప్నాకు, హరీష్ కు పరిచయం ఉంది. హరీష్, స్వప్నా అక్రమ సంబంధం పెట్టుకుని కొంతకాలంగా రెండు కుటుంబాలకు తెలీకుండా ఎంజాయ్ చేస్తున్నారు. స్వప్నా, హరీష్ వేరువేరు జిల్లాల్లో నివాసం ఉంటున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న హరీష్, స్వప్నా ఏదో ఒకరకంగా ఇద్దరూ నెలలో రెండుమూడుసార్లు కలుస్తున్నారని తెలిసింది.

హాసన్ లో హత్యకు స్కెచ్
ఈ విషయం రెండు కుటుంబాల సభ్యులకు తెలిసి ఇద్దరిని హెచ్చరించారు. హరీష్ ను హత్య చెయ్యడానికి అతని స్నేహితులే సిద్దం అయ్యారు. ప్రియుడు హరీష్ ను హత్య చెయ్యడానికి అతని స్నేహితులే రంగంలోకి దిగారని తెలిసింది. పక్కాప్లాన్ తో హరీష్ ను హాసన్ జిల్లాలోని అరకలగూడు తాలుకా, కూణనూరు పట్టణంలోకి పిలిపించారు.

సుస్మితాతో లాడ్జ్ రూమ్ లోకి ఎంట్రీ
సుస్మితా అనే మహిళ, హరీష్ కలిసి కూణనూరులోని ఓ లాడ్జ్ లో మేము దంపతులు అని చెప్పి ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. హరీష్ ను హత్య చెయ్యడానికి స్కెచ్ వేసిన దిలీప్, లక్ష్మణ అనే ఇద్దరు అదే లాడ్జ్ లో వేరే రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఇదే లాడ్జ్ లో మరో మహిళ, మరో వ్యక్తి కూడా వేరే రూమ్ తీసుకున్నారని తెలిసింది. ఇద్దరు భార్య,భర్తలు అని చెప్పిన హరీష్, సుస్మితా లాడ్జ్ లోని వారి రూమ్ లో రాత్రి ఉన్నారు.

ప్రియుడిని బాత్ రూమ్ లో నరికి చంపేశారు
అర్దరాత్రి దాటిన తరువాత లాడ్జ్ లోని వేర్వేరు రూమ్ ల్లో ఉన్న దిలీప్, లక్ష్మణ, మరో వ్యక్తి కలిసి హరీష్ బస చేసిన రూమ్ లోకి వెళ్లారు. అర్దరాత్రి హరీష్ ను లాడ్జ్ లోని రూమ్ లోని బాత్ రూమ్ లో నరికి చంపేశారు. ప్రియుడు హరీష్ ను చంపేసిన తరువాత లాడ్జ్ లోని రూమ్ లు ఖాళీ చేసిన దిలీప్, లక్ష్మణ, సుస్మితా తదితరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నేను ఒక్కడే చంపేశానని లొంగిపోయాడు
మరుసటి రోజు హరీష్ హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేశారు. అక్రమ సంబంధం విషయంలో హరీష్ ను నేనే చంపేశానని లక్ష్మణ్ అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే హరీష్ హత్య కేసులో లక్ష్మణతో పాటు సుస్మితా, దిలీప్ హస్తం ఉందని పోలీసులు అంటున్నారు.
Recommended Video

బెంగళూరు లేడీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది?
బెంగళూరు సమీపంలోని మాగడి తాలుకాలోని దోడ్డసోమనహళ్లికి చెందిన సుస్మితా బెంగళూరులోని రాజాజీనగర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గుడికి వచ్చానని కోణనూరులోని లాడ్జ్ లో సుస్మితా రూమ్ అద్దెకు తీసుకుందని పోలీసులు అంటున్నారు.
సుస్మితా, హరీష్ ఒకే రూమ్ లో ఎందుకున్నారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. హత్యకు గురైన హరీష్, హత్య చేసిన దిలీప్, లక్ష్మణ స్నేహితులని, వీరి మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. హరీష్ ను పక్కాప్లాన్ ప్రకారం సుస్మితాను ఎరవేసి హాసన్ జిల్లాకు పిలిపించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సుస్మితాను తన భార్య అని హరీష్ తోనే లాడ్జ్ సిబ్బందికి చెప్పించారని, ఇద్దరూ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే పక్కరూమ్ లో ఉన్న నిందితులు హరీష్ రూమ్ లోకి వెళ్లి ఉంటారని, తప్పించుకోవడానికి హరీష్ బాత్ రూమ్ లో దాక్కోవడానికి ప్రయత్నించడంతో అక్కడే అతన్ని చంపేసి ఉంటారని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications