Bengaluru: వందే భారత్ రైలు పై రాళ్ల వర్షం, ఎన్ని కోచ్ లపై దాడి ?, ఏంపోయేకాలం వచ్చిందో!

చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో సంచరిస్తున్న వందే భారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడంతో కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. రైల్వే పోలీసులు కిలోమీటర్ పొడవునా దుండగుల కోసం గాలించారు.

బెంగళూరు/చెన్న/మైసూరు: బెంగళూరు సౌత్ వెస్ట్రన్ రైల్వే డివిజన్‌లో కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడి కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో సంచరిస్తున్న వందే భారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడంతో కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి.

విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలో మొత్తం కిలోమీటర్ పొడవునా దుండగుల కోసం గాలించారు. అయితే ఎవ్వరు చిక్కలేదని పోలీసులు అంటున్నారు. వందే భారత్ రైలు మీద రాళ్ల వర్షం కురిపించడంతో రైల్వే పోలీసులు సీరియస్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే ?

సిటీలోనే రైలు మీద రాళ్లదాడి

సిటీలోనే రైలు మీద రాళ్లదాడి

శనివారం చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో సంచరిస్తున్న వందే భారత్ రైలు (20607) కృష్ణరాజపురం (కేఆర్ పురం) రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో వెలుతున్న సమయంలో గుర్తు తెలియిన వ్యక్తులు రైలు మీద రాళ్ల వర్షం కురిపించారు.

అయితే అదృష్టవశాత్తూ రైలులో ఉన్న ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వందే భారత్ సీ4 కోచ్ 10, 11, 12, సీ5 కోచ్ 20, 21, 22 కిటికీలు పగిలిపోయాయి. సాయంత్రం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు కిలోమీటరు మేర దుండుగుల కోసం గాలించారు.

అధికారులు సీరియస్

అధికారులు సీరియస్

వందే భారత్ రైలు మీద రాళ్ల దాడి జరగడంతో రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. ఈ విషయంపై సౌత్ వెస్ట్రన్ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుసుమా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కేసు నమోదు చేసిందని తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నైరుతి రైల్వే శాఖ అధికారులు ఆర్పీఎఫ్, రాష్ట్ర రైల్వే పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ల సహకారంతో ఆదివారం రైల్వే ట్రాక్ ల పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారని కుసుమా హరిప్రసాద్ వివరించారు.

రెండు నెలల్లో ఎన్ని కేసులు?

రెండు నెలల్లో ఎన్ని కేసులు?

దీంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్ర రైల్వే పోలీసులకు సమాచారం అందించామని, అక్రమార్కులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కుసుమా హరిప్రసాద్ కోరారు. గతంలో కూడా కదులుతున్న రైళ్ల మీద స్లమ్ ఏరియాల్లో, జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి. అయితే గత రెండు నెలలుగా ఈ కేసు ఎక్కువ కావడంతో రైల్వే శాఖ అధికారులు, పోలీసులు ఇప్పుడు సీరియస్ అయ్యారు.

విద్యార్థుల పనేనా?

విద్యార్థుల పనేనా?

రైళ్ల మీద రాళ్ల దాడులు చూస్తుంటే పాఠశాల, కళాశాల విద్యార్థులే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైళ్ల మీద రాళ్ల దాడులు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన ఆప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని అధికారులు అంటున్నారు. విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు.

చిక్కితే బెయిల్ కూడారాదు

చిక్కితే బెయిల్ కూడారాదు

రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు రువ్వడం నాన్ బెయిలబుల్ నేరం. ఇది రైల్వే ప్రయాణీకుల భద్రతకు ప్రమాదం కలిగిస్తే, నేరస్థుడికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉందని, కనీసం బెయిల్ కూడా రాదని అధికారులు అంటున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రైళ్ల మీద దాడులు చేసి ప్రయాణికులకు గాయాలైన తరువాత అలాంటి వాళ్లు పట్టుబడితే జైలుకు పంపిస్తామని, రాళ్ల దాడులు నిలిపివేయాలని నైరుతి రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+