బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఖర్మకాండ, ఉగ్రవాదులతో?, వాట్సాప్ గ్రూప్స్ లో బ్రైన్ వాష్, డాక్టర్ దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని అతన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఐటీ హబ్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో యువకులకు గాలం వేసి వారిని ఉగ్రవాదుల గ్రూపుల్లో చేర్చుతున్నాడని సమాచారం అందండంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఓ డాక్టర్, బ్యాంకు ఉద్యోగితో పాటు మరికొందరిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు వారు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ హబ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరును అరెస్టు చేశారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !

టార్గెట్ బెంగళూరు ?

టార్గెట్ బెంగళూరు ?

బెంగళూరును లక్షంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు చాలాసార్లు హెచ్చరించారు. గతంలో కూడా చిన్నస్వామి స్టేడియంతో పాటు నగరంలో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐటీ హబ్ బెంగళూరు మీద అధికారులు నిత్యం డేగ కన్ను వేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసి ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు.

 సాఫ్ట్ వేర్ ఇంజనీరు అరెస్టు

సాఫ్ట్ వేర్ ఇంజనీరు అరెస్టు

బెంగళూరులో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న జుహేబ్ మున్నా అనే వ్యక్తి ఐసిస్ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని అతన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. బెంగళూరులోనే నివాసం ఉంటున్న జుహేబ్ మున్నాకు ఉగ్రవాదులతో లింక్ ఉందని పక్కా సమాచారం అందండంతో అరెస్టు చేశారని సమాచారం.

సోషల్ మీడియాలో యువతకు గాలం

సోషల్ మీడియాలో యువతకు గాలం

సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న జుహేబ్ మున్నా గుట్గుచప్పుడు కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో యువతను సంప్రధించి వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడని అధికారులు అంటున్నారు. కురాన సర్కిల్ సంస్థ సభ్యుడు అయిన టెక్కీ జుహేబ్ మున్నా ఇప్పటికే చాలా మంది యువకులకు బ్రైన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా తయారు చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడని అధికారులకు పక్కా సమాచారం అందింది.

డాక్టర్ ఇచ్చిన సమాచారంతో టెక్కీ కథ క్లోజ్

డాక్టర్ ఇచ్చిన సమాచారంతో టెక్కీ కథ క్లోజ్

ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని వెలుగు చూడటంతో కర్ణాటకకు చెందిన దంతవైద్యుడు డాక్టర్ తౌశిక్ మహమ్మద్ ను ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. దంత వైద్యుడు డాక్టర్ తౌశిక్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరు జుహేబ్ మున్నా మీద ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు. పక్కా సమాచారంతో ఇప్పుడు టెక్కీ జుహేబ్ మున్నాను అధికారులు అరెస్టు చేశారు.

 బెంగళూరు ప్రేజర్ టౌన్ లో ?

బెంగళూరు ప్రేజర్ టౌన్ లో ?

డాక్టర్ తౌశిక్ అహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు 2020 సెప్టెంబర్ నెలలో బెంగళూరులోని ప్రేజర్ టౌన్ లో నివాసం ఉంటున్న వ్యాపారి ఇర్ఫాన్ నాసీర్, తమిళనాడులోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న మోహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈ నిందితులు ఐసిస్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారని,

Recommended Video

AP: 16 Health Hubs, Quality Medical Care పెద్ద నగరాలకు వెళ్ళక్కర్లేదు AP CM Jagan
యువతకు బ్రైన్ వాష్..... ఉగ్రవాదుల కోసం నిధులు సేకరణ ?

యువతకు బ్రైన్ వాష్..... ఉగ్రవాదుల కోసం నిధులు సేకరణ ?

యువతను ప్రలోభపెట్టి వారిని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి ప్రయత్నించారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు జుహేబ్ మున్నా బెంగళూరులో అరెస్టు కావడంతో ప్రజలు హడలిపోయారు. అయితే పూర్తి వివరాలు వెళ్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.

English summary
IT Hub: Suspected ISIS terrorist, Software Engineer arrested in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X