IT Hub: భార్యను చంపేసి విమానంలో రౌండ్స్, ఎన్ని సిటీలు తిరుగుతావురా ?, టెక్కీ తిక్క కుదిరింది, ఢమాల్!
బెంగళూరు/కోల్ కత్తా: ఉద్యోగం చెయ్యడానికి వచ్చిన వ్యక్తి అమ్మాయి పరిచయం కావడం, అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయిని వలలో వేసుకోవడం అంతా చకచకా సాగిపోయింది, అమ్మాయి కుటుంబ సభ్యులను ఒప్పించి లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి గర్బవతి అయ్యింది. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త రగిలిపోయాడు.
భార్యకు ప్రియుడు ఉందని రగిలిపోయిన భర్త గర్బవతి అయిన భార్యను చంపేసి విమానంలో తప్పించుకున్నాడు. పోలీసుల తప్పుదోవ పట్టించడానికి విమానంలో అక్కడికి ఇక్కడికి వెళ్లాడు. అయితే అక్కడే అసలు స్కెచ్ రివర్స్ అయ్యింది.

పోలీసులతో గేమ్స్
బెంగళూరులో ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్యను హత్య చేసి పరారైన భర్త నాసిర్ హుస్సేన్‌ను బెంగళూరులోని సుద్దగుంటే పాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి హత్య చేసి ఢిల్లీకి పారిపోయిన నిందితుడు నాసీర్ అతని భార్య హత్యకు చాలా కాలం నుంచి ప్లాన్ చేశాడని, అతని అడ్రస్ చిక్కకుండా భార్యను హత్య చెయ్యక ముందే ఢిల్లీకి విమాన టికెట్ బుక్ చేసుకున్నాడని వెలుగు చూసింది.

క్యాబ్ లో వెళ్లిపోయాడు
సుందగుంటపాళ్యలో భార్యను హత్య చేసిన తరువాత నాసీర్ క్యాబ్‌లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాడు. నిందితుడు నాసీర్ ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నాడు. తరువాత ఢిల్లీ వదిలిన నాసీర్ అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌కు మరో విమానంలో వెళ్లాడు. తరువాత బెంగళూరు పోలీసులు నిందితుడు నాసీర్ ను పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసి బెంగళూరు తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు.

నా భార్యకు అక్రమ సంబంధం
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే నా భార్య నాజ్‌ను హత్య చేశానని నిందితుడు నాసీర్ పోలీసులకు చెప్పాడు. నిందితుడు నాసిర్ హుస్సేన్ మాస్టర్ ప్లాన్ వేసి నాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాజ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో బాగా జల్సా చెయ్యడానికి అవకాశం ఉంటుందని నిందితుడు నసీర్ స్కెచ్ వేశాడు. అయితే పెళ్లి జరిగి ఏడాది కాకముందే భార్య నాజ్ కు అక్రమ సంబంధం ఉందని ఆమెను చంపేశానని నాసీర్ చెప్పడంతో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ట్యాక్సీ డ్రైవర్ తో ఏం చేశాడంటే?
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాసీర్ అతని భార్య నాజ్ ను హత్య చెయ్యక ముందు ఢిల్లీకి వెళ్లేందుకు విమాన టిక్కెట్టు బుక్ చేసుకున్నాడని సమాచారం. అతను టాక్సీ డ్రైవర్‌కు ఫోన్‌లో రూ. 4, 000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఎయిర్ పోర్టు చేరుకున్న తరువాత రూ. 3, 500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు .ఇక్కడా నాసీర్ గురించి బెంగలూరు పోలీసులకు సమాచారం అందింది

ఢిల్లీకి వెళ్లాడు కానీ?
బెంగళూరు నుంచి విమానంలో నాసీర్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కాడు. విమానం టేకాఫ్ అయిన చివరి క్షణంలో అతని భార్య నాజ్ సోదరుడికి మీ చెల్లిని చంపేశాను వెళ్లి శవం తెచ్చుకోరా అని మెసేజ్ పంపించాడు. నీ చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుందని, నన్ను మోసం చేసిందని, అందుకే కోపంతో దానిని చంపేశాను. ఇంటికి వెళ్లి మృతదేహాన్ని తీసుకెళ్లాలని మెసేజ్ పంపించి మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి పరారయ్యాడు.
ఢిల్లీకి పారిపోయిన నాసీర్ అక్కడి నుంచి కోల్ కత్తా వెళ్లి అక్కడ తలదాచుకున్నాడని పక్కా సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేసి అలాంటి విమానంలో సోమవారం బెంగళూరుకు తీసుకువచ్చారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications