బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో భూకంపం: ఉలిక్కిపడ్డ ఉద్యాననగరి

|
Google Oneindia TeluguNews

జకర్తా: సిలికాన్ సిటీ బెంగళూరులో భూకంపం సంభవించింది. బెంగళూరు నార్త్, ఈశాన్య ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. చిక్‌బళ్లాపుర జిల్లాలో ప్రకంపనలు నమోదయ్యాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో బెంగళూరియన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని గురించి ఆరా తీస్తోన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ఉదయం 7:14 నిమిషాలకు భూకంపం సంభవించింది. బెంగళూరుకు ఉత్తరం, ఈశాన్య దిశగా 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 23 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది. తొలుత ఈ ఉదయం 7:09 నిమిషాలకు 3.1 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. కొద్దిసేపటికే దాన్ని పునఃసమీక్షించింది.

 Karnataka: An earthquake of magnitude 3.3 hit the Bengaluru

దీని తీవ్రత మరంత అధికంగా ఉన్నట్లు గుర్తించింది. భూకంపం సంభవించిన సమయాన్ని కూడా సవరించింది. దీని తీవ్రతను 3.3గా నిర్ధారించింది. కర్ణాటకలో ఈ మధ్యకాలంలో వరుసగా స్వల్ప స్థాయి భూ ప్రకంపనాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- కర్ణాటక ఉత్తర ప్రాంతంలో దీని తీవ్రత కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బీదర్, కలబురగి, విజయపుర జిల్లాల్లో ఇవి నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3 నుంచి 4 వరకు రికార్డయ్యాయి. దీన్ని హైడ్రో సెస్మీసిటీగా నిర్ధారించారు అధికారులు.

కృష్ణా నదీ తీర ప్రాంతం కావడం వల్ల వర్షాకాలం ఆరంభ సమయంలో, ఆ తరువాత ఈ హైడ్రో సెస్మీసిటీ రికార్డవుతుంటుందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కర్ణాటక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబర్ వరకు కనీసం 15 సార్లు భూమి స్వల్ప స్థాయిలో కంపించిందని పేర్కొన్నారు. హసరగుండ్గి, యెలకలహళ్లి, చించోలి వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు నమోదవుతుంటాయని చెప్పారు.

English summary
An earthquake of magnitude 3.3 hit the North-Northeast of Karnataka's Bengaluru this morning, informed the National Center for Seismology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X