Karnataka polls : కర్నాటక బీజేపీలో తిరుగుబాటు ముప్పు? 40 సీట్లలో రెబెల్స్ రెడీ ..!
కర్నాటకలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి టికెట్ల కేటాయింపు అంత సులువుగా కనిపించడం లేదు. ముఖ్యంగా మరోసారి అధికారంలోకి వస్తామని కమలనాథుల్లో వ్యక్తమవుతున్న ధీమాతో ఈసారి టికెట్లకు గట్టి పోటీ నెలకొంది. దీంతో కనీసం 40 స్ధానాల్లో టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అసమ్మతి రేపేందుకు సిద్ధంగా ఉండటంతో అధిష్టానం టికెట్లపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఓవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యర్ధిగా ఉన్న విపక్ష కాంగ్రెస్ ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసి దూసుకెళుతోంది. వీటిపై ఎలాంటి అసంతృప్తులూ కనిపించలేదు. కానీ బీజేపీలో మాత్రం తొలి జాబితా ఇప్పటికీ విడుదల కాకపోగా.. విడుదల తర్వాత టికెట్లు వారి నుంచి ఎలాంటి అసంతృప్తి ఎదురవుతుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ
టికెట్లను ఖరారు చేసేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశమవుతోంది.

కర్నాటకలో బీజేపీ టికెట్ల ఖరారు విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొని ఉందని కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు కూడా అయిన మాజీ సీఎం యడియూరప్ప చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కచ్చితంగా గెలిచే స్ధానాల్లో టికెట్ కోసం ప్రతీ చోటా ముగ్గురు నుంచి ఐదుగురు పోటీ పడుతున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో తాము ఒక్కో చోట రెండు నుంచి మూడు పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు యడ్డీ తెలిపారు. గెలిచే అవకాశాలు, కేంద్ర పార్టీ సూచన మేరకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తామన్నారు.
దాదాపు 40 నియోజకవర్గాల్లో ఆశావహులకు టికెట్లు దక్కకపోతే రెబెల్స్ గా మారి బరిలోకి దిగుతామని ఇప్పటికే అధిష్టానానికి హెచ్చరికలు అందుతున్నాయి. గత ఎన్నికల్లో రెబెల్స్ ను మేనేజ్ చేసి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన గోకక్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి... ఈసారి తమ వారికి మూడు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో తేడా వస్తే తాను కూడా పోటీ చేయనని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications