కౌంటింగ్, బాంబు పేల్చిన లఖన్ బాయ్, బీజేపీలోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా ప్రకటించక ముందే బీజేపీ నాయకులు బాంబు పేల్చారు. 2019లో ఎలా ఆపరేషన్ కమలకు తెరతీశామో ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి సోదరుడు లఖన్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మే 10వ తేదీన కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2, 600 మంది పోటీ చేశారు. సీఎం, మాజీ సీఎంలు, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మొదటి సారి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకున్న నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

Karnataka assembly elections 2023

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుందని, బీజేపీ రెండో స్థానానికి పరిమితం అవుతుందని, జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దేశం మొత్తం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్ని ఏకం కావాలని ప్లాన్ చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే బెళగావికి చెందిన షావుకారు ఫ్యామిలీలోని బీజేపీ ఎమ్మెల్సీ లఖన్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని 17 మంది ఎమ్మెల్యేలు ఎలా కుప్పకూల్చి బీజేపీని అధికారంలోకి తెచ్చారు అనే విషయాన్ని ఎమ్మెల్సీ లఖన్ జారకిహోళి గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాత బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే ఆపరేషన్ కమలా తెరమీదకు రాదని లఖన్ జారిహోళి అన్నారు. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే ఆపరేషన్ కమల తెరమీదకు వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి ఇప్పటికే సిద్దంగా ఉన్నారని, వాళ్లు మాతో టచ్ లో ఉన్నారని ఎమ్మెల్సీ లఖన్ జారకిహోళి బాంబు పేల్చారు.

Karnataka assembly elections 2023

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు, కచ్చితంగా రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని, అధికారంలో ఉంటే వారి పనులు కూడా జరుగుతాయని ఎమ్మెల్సీ లఖన్ జారకిహోళి జోస్యం చెప్పారు. గోవాలో ఎన్నికల తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.

గోవా సీన్ కర్ణాటకలో కూడా రిపీట్ అవుతుందని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని ఎమ్మెల్సీ లఖన్ జారకిహోళి బాంబు పేల్చారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలా వలలో వేసుకుంటుంది ?, ఆ చాన్స్ మేము ఎందుకు ఇస్తామని, మతిలేకుండా మాట్లాడితే సరిపోతుందా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జారకిహోళి బ్రదర్స్ లో ఒకరైన సతీష్ జారకిహోళి మండిపడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగడానికి అవకాశం ఉందని, ఆ పార్తీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయ్యే నాయకులు చాలా మంది ఉంటారని లఖన్ బాయ్ అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఆపరేషన్ కమలాకు తెర లేపుతామని లఖన్ బాయ్ క్లూ ఇస్తున్నట్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+