బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన హ్యాకర్లు, అకౌంట్స్ హ్యాక్, నూరు జన్మలెత్తినా ఏం చెయ్యలేరు. గాలి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సోసల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు పరోక్షంగా ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మా నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేశారని, హ్యాకర్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు పోలీసు కేసు పెట్టారు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించి కర్ణాటకలో మూడు పార్టీలకు తలనొప్పిగా మారిన గాలి జనార్దన్ రెడ్డి మీద హ్యాకర్లు పంజా విసరడం హాట్ టాపిక్ అయ్యింది.

girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా?!girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా?!

ప్రత్యక్ష రాజకీయాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరం

ప్రత్యక్ష రాజకీయాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరం

కర్ణాటక రాజకీయాలను ఓ రైంజ్ లో శాసించిన గాలి జనార్దన్ రెడ్డి తరువాత అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గాలి జనార్దర్ రెడ్డి సోదరులు గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కర్ణాటక రవాణా శాఖా మంత్రిగా పని చేస్తున్నారు.

12 ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి

12 ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి

కర్ణాటక రాజకీయాల్లో 12 ఏళ్ల తర్వాత మళ్లీ గాలి జనార్ధన్ రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల మాత్రమే మిగిలి ఉండటంతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి ఆయన గెలుపుతో పాటు ఆయన మద్దతుదారులను గెలిపించుకుంటానని ధీమాగా ఉన్నారు.

మూడు పార్టీలకు గాలి జనార్దన్ రెడ్డి షాక్

మూడు పార్టీలకు గాలి జనార్దన్ రెడ్డి షాక్

కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి తలనొప్పిగా తయారైనారని ఆ పార్టీలకు చెందిన కొందరు నాయకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యాయని జనార్దర్ రెడ్డి సన్నిహితుడు దామోదర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

రెడ్డి కొత్త పార్టీ కలకలం

రెడ్డి కొత్త పార్టీ కలకలం

కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ సింబల్ తో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన హ్యాకర్ల బెదిరింపుల పాల్పడుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. హ్యాకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందాయని, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు దామోదరరెడ్డి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూరుజన్మలు ఎత్తినా ఏమీ చెయ్యలేరు

నూరుజన్మలు ఎత్తినా ఏమీ చెయ్యలేరు

కళ్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ అవిర్భవించిందని కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వ సంస్థ సీబీఐని దుర్వినియోగం చేసి గాలి జనార్దన్ రెడ్డిని బెదిరిస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. 100 జన్మలెత్తినా మా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయలేదని కళ్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి కొందరు నాయకులకు పరోక్షంగా సవాల్ విసిరారు.

ఆ రోజు కేవలం అప్ప కోసం వదిలేశాను

ఆ రోజు కేవలం అప్ప కోసం వదిలేశాను

కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరపున శుక్రవారం నిర్వహించిన భారీ సభలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల గాలి జనార్దన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేశారు. ఈ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లోనే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. అప్పుడు యడియూరప్పకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కొందరు అడ్డుకుంటారని తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

ఆ భయం తనకు ఉంది

ఆ భయం తనకు ఉంది

బీఎస్ యడుయూరప్ప కోసమే 2018లో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టకుండా వెనక్కి తగ్గానని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టడంతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ తన మీద దాడికి దిగుతుందనే భయం ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను కష్టపడి డబ్బు, ఆస్తులు సంపాదించాను. తనను రాజకీయంగా అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టానని, పార్టీ కార్యక్రమాలు కేవలం కర్ణాటక భాగానికే పరిమితం కాలేదని, 2028 నాటికి కర్ణాటకలో మా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని గాలి జనార్దన్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.

English summary
Karnataka Ex-minister Gali Janardhan Reddy's social media accounts hacked, police who registered a case, Gali fans fire on BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X