భర్తతో కటీఫ్: ప్రియుడితో రొమాన్స్: పాడుబడిన వ్యవసాయ బావిలో డెడ్‌బాడీ

బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మరో మతానికి చెందిన వాడిని తమ కుమార్తె ప్రేమించిందనే కారణంతో తల్లిదండ్రులు సొంత కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు మృతురాలి పెదనాన్న సహకరించాడు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఓ వ్యవసాయ బావి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. చిక్‌బళ్లాపూర్‌లోని గౌరిబిదనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

లివింగ్ రిలేషన్

లివింగ్ రిలేషన్

మృతురాలి పేరు పర్వీనా బాను. ఆమె తల్లిదండ్రులు గుల్జార్ బాను, ఫయాజ్‌తో కలిసి గౌరిబిదనూరులో నివసిస్తున్నారు. పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. రెండేళ్లకే ఆమె అత్తింటిని వదిలి పెట్టారు. గౌరిబిదనూరు మండలం మణిపాల గ్రామానికి చెందిన శివప్పతో ప్రేమలో పడ్డారు. అతనితో కలిసి కొంతకాలం సహజీవనం చేశారు. ఆ సమయంలోఆమె తన పేరును శిల్పాగా మార్చుకున్నారు. అనారోగ్య కారణంతో శివప్ప మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తూ.. జీవనోపాధి కోసం ఓ గార్మెంట్స్ షాప్‌లో చేరారు.

పాడుబడిన వ్యవసాయ బావిలో

పాడుబడిన వ్యవసాయ బావిలో


ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుల్జార్ బాను, ఫయాజ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. సహజీవనం చేసినట్లు తెలియడంతో తరచూ మాటలతో వేధిస్తుండే వారు. దీన్ని భరించలేక ఆమె ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఫయాజ్ తన సోదరుడు ప్యారేజాన్‌ సహకారంతో పర్వీనా బానును హత్య చేశాడు. దీనికి మృతురాలి తల్లి గుల్జార్ బాను సహకరించింది. ముగ్గురు కలిసి ఆమె మృతదేహాన్ని గౌరిబిదనూరు సమీపంలోని ఓ పాడుబడిన వ్యవసాయ బావిలో పడేశారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..

దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తమ కుమార్తె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశారు. భర్త నుంచి విడిపోవడం, సహజీవనం చేసిన శివప్ప అనారోగ్య కారణంతో మరణించడం వంటి కారణాలతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిందని గుల్జార్ బాను, ఫయాజ్ స్థానికులను నమ్మించారు. పోస్ట మార్టమ్ రిపోర్ట్‌ తల్లిదండ్రుల ఘాతుకాన్ని బయటపెట్టింది. పర్వీనా బాను బావిలో దూకి మరణించలేదని, ఊపిరి ఆడకపోవడమే ఆమె చావుకు కారణమైనట్లు డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు.

 గొంతు నులిమి

గొంతు నులిమి


గొంతు నులిమినట్లుగా ఆనవాళ్లు లభించడంతో పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తమదైన స్టైల్‌లో విచారించడంతో నిందితులు తమ ఘాతుకాన్ని అంగీకరించారు. తామే హత్య చేసినట్లు చెప్పారు. భర్త నుంచి విడిపోయిన తరువాత అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల తమ పరువు పోయిందని, ఆ అక్కసుతోనే పర్వీన్‌ను హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు. తల్లిదండ్రులతో పాటు ఈ హత్యకు సహకరించిన పెదనాన్నను గౌరిబిదనూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+