సర్వేలు వేరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వేరు. సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ తో షాక్!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని జన్ కీ బాత్-సవర్ణ న్యూస్ కన్నడ ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. కర్ణాటకలో మొదటిసారి బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వస్తుందని జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది.

జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కర్ణాటకలోని వివిద జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల సమీపంలోకి వెళ్లి ఓటు వేసి ఇంటికి వెలుతున్న ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెలుగు చూసింది. ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలిసిపోయి బీజేపీ అధికారంలోకి రాకపోయినా కర్ణాటకలో బీజేపీ మాత్రమే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.

 Karnataka assembly elections 2023

సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 94 నుంచి 117 స్థానాలు వస్తాయని, ఇక బీజేపీ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 91 నుంచి 106 సీట్లు వస్తాయని, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు 14 నుంచి 24 సీట్లు వస్తాయని, ఇతర పార్టీల అభ్యర్థులు 0 నుంచి కేవలం 2 సీట్లలో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది.

అయితే ఇదే జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కలిసి మే 4వ తేదీన రాత్రి సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఆరు రోజులు క్రితం సువర్ణ న్యూస్ విడుదల చేసిన సర్వే ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 నుంచి 114 స్థానాలు వస్తాయని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 86 నుంచి 98 సీట్లు వస్తాయని, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు 20 నుంచి 26 సీట్లు వస్తాయని, ఇతర పార్టీల అభ్యర్థులు 0 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సువర్ణ న్యూస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు మరో విధంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+