Khiladi: రూ. 63 లక్షల ఏటీఎం క్యాష్ తో ఉద్యోగి పరార్ , పెళ్లాన్ని వదిలేసి లవర్ తో ఎస్కేప్, అబ్బా!

బెంగళూరు/ చెన్నై/ ముంబాయి: ఐటీ, బీటీ సిటీ బెంగళూరు నగరంలో ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 63 లక్షలతో పరారైన కేటుగాడి కొత్తకథ వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోతున్నారు. పేరుపొందిన క్రిమినల్స్ సైతం ఏదో ఒక విషయంలో పోలీసులకు చిక్కిపోతున్నా ఈ ఏటీఎం నగదు లూటీ చేసిన కిలాడీ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. భార్యను, ఇద్దరు పిల్లలను గాలికి వదిలేసిన కేటుగాడు ఏటీఎంలో నిల్వ చెయ్యాలన్సిన రూ. 63 లక్షల నగదు లూటీ చేసి లవర్ తో కలిసి చెక్కేశాడని పోలీసులకు పక్కా క్లారిటీ వచ్చింది.

బెంగళూరు సిటీ సంస్థ

బెంగళూరు సిటీ సంస్థ

ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు సిటీలోని ప్రజలు ప్రతినిత్యం కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఏటీఎం యంత్రాల్లో వితడ్రా చేసుకుంటుంటారు. పెక్యూర్ వ్యాల్యూ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది బెంగళూరు సిటీలోని పలు ఏటీఎం కేంద్రాల్లో ప్రతిరోజూ డబ్బులు నిల్వ చేస్తుంటారు.

కేటుగాడు ఉద్యోగి

కేటుగాడు ఉద్యోగి

కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి నివాసి యోగీష్ అనే వ్యక్తి సెక్యూర్ వ్యాల్యూ సంస్థలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చెయ్యడానికి ఉపయోగిస్తున్న వాహనం ( ఏటీఎం క్యాష్ వ్యాన్) డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం నుంచి యోగీష్ చాలా నమ్మకంగా సెక్యూర్ వ్యాల్యూ సంస్థలో వ్యాన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

జస్ట్ రూ. 63 లక్షలతో ఎస్కేప్

జస్ట్ రూ. 63 లక్షలతో ఎస్కేప్

కొన్ని రోజుల క్రితం యోగీష్ తో పాటు సెక్యూర్ వ్యాల్యూ ఉద్యోగులు బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో సాటి సిబ్బంది కళ్లుకప్పిన కేటుగాడు యోగీష్ ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 63 లక్షల నగదు లూటీ చేసి ఓ బ్యాగ్ లో పెట్టుకుని అక్కడి నుంచి పరారైనాడు.

కిలాడీలకే కిలాడీ

కిలాడీలకే కిలాడీ

ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 63 లక్షల నగదుతో పాటు పరారైన యోగీష్ కోసం బెంగళూరు పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలించారు. రూ. 63 లక్షల నగదుతో మాయం అయిన యోగీష్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రూ. 63 లక్షలతో మాయం అయిన తరువాత యోగీష్ అతని మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేటుగాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం పోలీసులు గుర్తించలేకపోయారు.

అత్తకూతురు ఖాళీగా ఉందని

అత్తకూతురు ఖాళీగా ఉందని

యోగీష్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. యోగీష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు ఉన్న యోగీష్ అత్త కూతురితో లవ్ లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. యోగీష్ అత్త కూతురికి కూడా ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, అయితే ఆమె భర్తను వదిలేసి ప్రస్తుతం ఖాళీ ఉందని, యోగీష్ ను ఆమె ప్రేమిస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పెళ్లాన్ని వదిలేసి ప్రియురాలితో జల్సాలు

పెళ్లాన్ని వదిలేసి ప్రియురాలితో జల్సాలు

భార్యకు తెలీకుండా అత్త కూతురితో లవ్ లో ఉన్న యోగీష్ ఆమెతో పరారై ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు అన్నారు. ఏటీఎం నగదు లూటీ చెయ్యకముందు యోగీష్ అతని అత్త కూతురికి ఫోన్ చేసి నువ్వు రెఢీగా ఉండాలని, నేను వచ్చేస్తానని చెప్పాడని, తరువాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో మొబైల్ టవర్ కు చిక్కడం లేదని పోలీసులు అన్నారు.

మాయలోడు ఎక్కడున్నాడు?

మాయలోడు ఎక్కడున్నాడు?

తన భర్త యోగీష్ ఏటీఎం డబ్బులు లూటీ చెయ్యడమే కాకుండా అత్త కూతురితో ఎస్కేప్ అయ్యాడని తెలుసుకున్న అతని భార్య షాక్ కు గురైయ్యింది. యోగీష్ అత్తకూతురితో కలిసి ఎక్కడికి పరారైనాడు అనే విషయం మాత్రం పోలీసులు ఏమాత్రం చిక్కడం లేదు. యోగీష్ ఎవరి పేరుతో మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నాడు ? అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+