అచ్చే దిన్ అంటే ఇదేనా మోదీ జీ ?, మీ ఫోటోలు, ఫెక్సీలు పెట్టినవాళ్లే చింపేస్తున్నారు!
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడిగే కాలం పోయింది, ఎవరైతే నరేంద్ర మోదీ ఫోటోలు, బ్యానర్లు వేశారో అదే బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు మోదీ ఫోటోలు, బ్యానర్లు చింపేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకాలం చెబుతున్న అచ్చే దిన్ అంటే ఇదే అని కేపీసీసీ నాయకులు వ్యంగంగా సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకుని గెలిచిపోవాలని ఊహలు కంటున్న నాయకులకు త్వరలోనే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్దిచెబుతారని కేపీసీసీ ట్విట్ చేసింది. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎందుకు మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేదు అని ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని బీజేపీని కేపీసీసీ ప్రశ్నించింది.

గుజరాత్ లో ఏకచత్రాదిపత్యం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కర్ణాటకలో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నించారని, అయితే ఇక్కడి కన్నడిగులు వీళ్ల ఆటలు సాగడానికి అవకాశం ఇవ్వరని కేపీసీసీ నాయకులు అంటున్నారు. ఏకచత్రాధిపత్యం, నిరంకుశపాలనకు కన్నడిగులు ఎప్పుడు తలవంచరని, త్వరలోనే బీజేపీకి బుద్ది చెబుతారని కేపీపీసీ నాయకులు అంటున్నారు.
నిన్న ఆహో ఓహో అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు అతికించి, బ్యానర్లు కట్టిన బీజేపీ నాయకులు ఇప్పుడు మోదీ ఫోటోలు ఉన్న ప్రతిచోట బొక్కలు పెడుతున్నారని కేపీసీసీ ఎద్దేవ చేసింది. ప్రధాని మోదీ ఫోటోలు ఉన్న పోస్టర్లు, బ్యానర్లకు బీజేపీ కార్యకర్తలు బొక్కలు పెట్టిన ఫోటోలను కేపీసీసీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఇంతకాలం ఉందని, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆలస్యంగా గుర్తించిన బీజేపీ హైకమాండ్ చివరికి వారికి టిక్కెట్లు ఇవ్వకుండా వేరే నాయకులకు టిక్కెట్లు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. త్వరలోనే బీజేపీకి తగిని గుణపాఠం చెప్పడానికి ఓటర్లు సిద్దంగా ఉన్నారని, బీజేపీ నాయకులను కచ్చితంగా ఇంటికి పంపిస్తారని, తరువాత కన్నడిగులకు మంచి రోజులు వస్తాయని, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేపీసీసీ నాయకులు ధీమాగా చెబుతున్నారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!











Click it and Unblock the Notifications