సిద్దూకు ఊహించని షాక్ ఇచ్చిన డీకేశీ, ఆ కులం ఓట్లు గోవిందా గోవిందా, స్కెచ్ ?
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్. జేడీఎస్ పార్టీల మధ్య పోటీ ఉంది. అయితే ఒకే పార్టీలో సీఎం రేసులో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య తేడాలు వచ్చాయని మరోసారి వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం సిద్దరామయ్యకు పోటీగా బెంగళూరుకు చెందిన మంత్రి వి. సోమణ్ణ బరిలో ఉన్నారు. సిద్దరామయ్యను ఎలాగైనా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కురుబ వర్గం నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

బుధవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ వరుణా నియోజక వర్గంలో మాజీ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా ప్రచారం చెయ్యవలసి ఉంది. వరుణా నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మైసూరు వెళ్లవలసి ఉంది. అయితే చివరి క్షణంలో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
వరణా నియోజక వర్గం వైపు కన్నెత్తికూడా చూడకుండా డీకే. శివకుమార్ నేరుగా మైసూరు వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వరుణాఆ నియోజక వర్గంలో భారీగా ఓటు బ్యాంక్ ఉన్న ఒక్కలిగులు మాజీ సీఎం సిద్దరామయ్యకు ఓట్లు వెయ్యాలని ప్రచారం చెయ్యకుండా అదే ఒక్కలిగ వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఎందుకు ఎన్నికల ప్రచారం చెయ్యకుండా వెళ్లిపోయారని చర్చ మొదలైయ్యింది.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తలోమాట చెబుతున్నారు. మాజీ సీఎం సిద్దరామయ్య గెలుపు నల్లేరుమీద నడకలాంటిది, ఆయనకు మనం ప్రచారం చెయ్యడం ఏమిటి అని డీకే శివకుమార్ అన్నారని కొందరు అంటున్నారు ఇంకా కొంత మంది మాత్రి డీకే శివకుమార్ అనివార్య కారణాల వలన సిద్దరామయ్య నియోజక వర్గం వరుణాలో ఎన్నికల ప్రచారం చెయ్యలేకపోయారని అంటున్నారు.
మొత్తం మీద అయితే మాజీ సీఎం సిద్దరామయ్యకు మాత్రం డీకే. శివకుమార్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఒకే పార్టీలో సీఎం రేసులో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఇగో ప్రాబ్లమ్ వచ్చిందని అంటున్నారు. అయితే సిద్దరామయ్య, డీకే. శివకుమార్ నోరు విప్పితే అసలు మ్యాటర్ బయటకు వస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications