Sister in law: వదినతో యవ్యారం చెడింది. అన్న ముందే వదినను చంపేసి ఎస్కేప్, అసలు మ్యాటర్!

బెంగళూరు/తుమకూరు: అన్నదమ్ములు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కలిసే ఉన్నారు. అన్న పెళ్లి చేసుకుని అతని భార్యతో కలసి వేరుగా ఉంటున్నాడు. సోదరుల మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వదినకు, ఆమె మరిదికి ఇటీవల కాలంలో వ్యవహారం చెడింది. వదిన, మరిది ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోయారు. రాత్రి అన్నవదినలతో యువకుడు గొడవపడ్డాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన యువకుడు అతని వదినను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు.

అన్నదమ్ములు హ్యాపీ

అన్నదమ్ములు హ్యాపీ

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలుకాలోని బెళూరులో విజయ్ కుమార్, అతని తమ్ముడు రఘు (25) నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు విజయ్ కుమార్, రఘు కలిసే ఉన్నారు. రఘు అన్న విజయ్ కుమార్ త్రిషా (35) అనే మహిళను పెళ్లి చేసుకుని అతని భార్యతో కలసి వేరుగా ఉంటున్నాడు.

వదిన జోక్యం ఎక్కువ అయ్యింది

వదిన జోక్యం ఎక్కువ అయ్యింది

సోదరులు విజయ్ కుమార్, రఘుల మద్య కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అన్న విజయ్ కుమార్ ఆర్థిక లావాదేవీల విషయంలో వదిన త్రిషా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నదని రఘు అసహనంతో ఉన్నాడు. ఇదే విషయంలో త్రిషాకు, ఆమె మరిది రఘుల మద్య గొడవలు కూడా జరిగాయి.

వదినను చంపేసిన మరిది

వదినను చంపేసిన మరిది

వదిన త్రిషాకు, ఆమె మరిది రఘుకు పెద్దలు నచ్చచెప్పినా ఇద్దరూ మొండిగా ఒకరి మీద ఒకరు మండిపడుతున్నారు. త్రిషా, ఆమె మరిది రఘు ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోయారు. శుక్రవారం రాత్రి అన్నవదినలు విజయ్ కుమార్, త్రిషాతో రఘు గొడవపడ్డాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన రఘు కత్తి తీసుకుని అతని వదిన త్రిషాను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన త్రిషాను ఆషుపత్రికి తరలించారు. అయితే త్రిషా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రఘ కోసం గాలిస్తున్నామని గుబ్బి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+