అనుమానాస్పదంగా ఇంట్లో శవమైన లేడీ టీచర్, చంపేశారని టెక్కీ మీద కేసు పెట్టిన అత్త!

బెంగళూరు/మండ్య: యువతి బాగా చదువుకుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి సంబంధాలు చూశారు. ఒకే జిల్లాకు చెందిన యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నాడు. భర్త టెక్కీగా, భార్య స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇంటిలో లేడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

బెంగళూరులో ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. మా అల్లుడు తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లి కేసు పెట్టింది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర సమీపంలోని పూర్ణప్రజ్ఞా లేఅవుట్‌లో నివాసం ఉంటున్న రష్మీ(30) అనే మహిళ అనుమానాస్పద స్థితి మృతి చెందని పోలీసు అధికారులు అంటున్నారు.

Lady teacher found dead in suspicious condition at home in Bengaluru city. The lady teachers husband is a software engineer

శుక్రవారం రష్మీ బెడ్ రూమ్ తలుపులు తీయకపోవడంతో ఆమె భర్త అరవింద్ తలుపులు పగులగొట్టి చూడగా రష్మీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అతనే మాకు సమాచారం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. మృతురాలి తల్లిదండ్రులు అల్లుడు అరవింద్‌పై హత్య కేసు పెట్టారు. అల్లుడు అరవింద్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సుబ్రమణ్యపుర పోలీసు అధికారులు తెలిపారు.

మండ్యా జిల్లాలోని మద్దూరుకు చెందిన రష్మీ, శ్రీరంగపట్టణానికి చెందిన అరవింద్‌లకు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. రష్మీ, అరవింద్ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అరవింద్ అతని భార్య రష్మీతో కలిసి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్రమణ్యపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రష్మీ టీచర్‌గా పని చేస్తున్నదని పోలీసులు అన్నారు. దంపతులు కొన్నేళ్లుగా పూర్ణప్రజ్ఞ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు.

గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అరవింద్‌, రష్మీల మధ్య గొడవ జరిగింది. తరువాత అర్దరాత్రి రష్మీ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. శుక్రవారం రష్మీ గది తలుపులు తీయ్యలేదని తెలిసింది. అరవింద్ చాలాసార్లు తలుపు తట్టినా రష్మీ నుంచి ఎలాంటి స్పందన లేదని, అనంతరం భర్త అరవింద్ తలుపులు పగులగొట్టి చూడగా రష్మీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు అన్నారు. సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+