కర్ణాటకకు కాబోయే లేడీ సీఎం లేదా ఉప ముఖ్యమంత్రి ?, మేడమ్ తో డీల్ కుదిరిందా!
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లేడీ సీఎం లేదా ఆమె మహిళా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
బెళగావి గ్రామీణ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. లక్ష్మీ హెబ్బాళ్కర్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు చాలా సన్నిహితురాలు. బెళగావి జిల్లాలోని బీజేపీ నాయకుల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

బెళగావి జిల్లాలో చక్రం తిప్పుతున్న లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఉత్తర కర్ణాటకు చెందిన లీడర్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం చెయ్యాలని అనుకుంటే ముందు వరుసలో లక్ష్మీ హెబ్బాళ్కర్ పేరు ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
బెళగావికి చెందిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. చాలాకాలం నుంచి ఇద్దరి మధ్య రాజకీయంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సహకార బ్యాంకు ఎన్నికల విషయంలో లక్ష్మీ హెబ్బాళ్కర్, రమేష్ జారకిహోళిల మధ్య ఆదిపత్య పోరు రసవత్తరంగా మారిపోయింది.
బీజేపీ నాయకుడు రమేష్ జారకిహోళి మంత్రిగా పని చేసే సమయంలో బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోని పీజీలో ఉండే యువతితో రాసలీలు సాగించారని ఓ సీడీ లీక్ కావడంతో కర్ణాటకలో కలకలం రేపింది. ఇదే విషయంలో రమేస్ జారికిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ పెద్ద ఎత్తున ఆందోళలన చేశారు. చివరికి రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి లక్ష్మీ హెబ్బాళ్కర్, రమేష్ జారకిహోళిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.












Click it and Unblock the Notifications