Lecturer: బర్త్ డే రోజు హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ లేడీ లెక్చరర్, డెత్ నోట్ లో ఏముందంటే?

బెంగళూరు/ చామరాజనగర్: పీజీ చదివిన అమ్మాయి ప్రముఖ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరింది. సొంత ఇంటికి, ఉద్యోగం చేస్తున్న కాలేజ్ కు చాలా దూరం ఉండటంతో ఆమె కాలేజ్ హాస్టల్ లోనే నివాసం ఉంటున్నది. కాలేజ్ లేడీ లెక్చరర్ బర్త్ డే రోజు కాలేజ్ లో గ్రాండ్ గా పుట్టిన రోజు వేడుకలు చెయ్యాలని కాలేజ్ విద్యార్థులు, సాటి లెక్సరర్స్ అనుకున్నారు. బర్త్ డే రోజు లేడీ లెక్చరర్ కాలేజ్ కు రాకపోవడంతో కాలేజ్ సిబ్బంది వెళ్లి హాస్టల్ లోకి వెళ్లి చూశారు. బర్త్ డే రోజు కాలేజ్ లెక్చరర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కాలేజ్ లో లెక్చర్ ఉద్యోగం

కాలేజ్ లో లెక్చర్ ఉద్యోగం

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో చందనా అలియాస్ చందు (26) అనే యువతి నివాసం ఉంటున్నది. మైసూరు నగరంలోని ప్రముఖ కాలేజ్ లో పీజీ చదివిన చందనా మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. చామరాజనగర్ లోని జేఎస్ఎస్ కాలేజ్ లో చందనా లెక్చరర్ గా ఉద్యోగంలో చేరింది. ప్రముఖ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరిన చందనా సంతోషంగా కాలం గడుపుతోంది.

పుట్టిన రోజు వేడుకలకు ప్లాన్

పుట్టిన రోజు వేడుకలకు ప్లాన్

సొంత ఇంటికి, చామరాజనగర్ లో ఉద్యోగం చేస్తున్న కాలేజ్ కు చాలా దూరం ఉండటంతో చందనా కాలేజ్ హాస్టల్ లోనే నివాసం ఉంటున్నది. కాలేజ్ లేడీ లెక్చరర్ చందనా బర్త్ డే రోజు కాలేజ్ లో గ్రాండ్ గా పుట్టిన రోజు వేడుకలు చెయ్యాలని కాలేజ్ విద్యార్థులు, సాటి లెక్సరర్స్ రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నారు.

బర్త్ డే రోజు ఆత్మహత్య చేసుకున్న లేడీ లెక్చరర్

బర్త్ డే రోజు ఆత్మహత్య చేసుకున్న లేడీ లెక్చరర్

బర్త్ డే రోజు లేడీ లెక్చరర్ చందనా కాలేజ్ కు రాకపోవడంతో మద్యాహ్నం వరకు వేచి చూసిన కాలేజ్ సిబ్బంది హాస్టల్ లోకి వెళ్లి చూశారు. బర్త్ డే రోజు కాలేజ్ లెక్చరర్ చందనా హాస్టల్ లో ఆమె నివాసం ఉంటున్న రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చందనా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టిందని చామరాజనగర్ పోలీసులు అన్నారు.

డెత్ నోట్ లో ఏముందంటే?

డెత్ నోట్ లో ఏముందంటే?

నా ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదు అని మాత్రమే చందనా డెత్ నోట్ రాసిందని, అందులో ఎలాంటి వివరాలు లేవని పోలీసులు అంటున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న చందనా బర్త్ డే రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. చందనా మొబైల్ ఫోన్ లోని డేటా ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+