బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

facebook Post: బెంగళూరు అలర్లకు పోటీగా స్కెచ్, ఈసారి శ్రీరాముడు, అయోధ్యపై పోస్టు, పండగ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ రాయచూరు: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలోని డీజే హళ్ళి, కేజీ హళ్లి ప్రాంతాల్లో జరిగిన హింస చల్లారకముందే కర్ణాటకలో మరో ప్రాంతంలో అలాంటి అల్లర్లు సృష్టించడానికి కొందరు అల్లరిమూకలు ప్రయత్నించాయి. అయితే సరైన సమయంలో పోలీసులు రంగంలోకి దిగడంతో పెద్ద గండం తప్పింది. అయోధ్యలోని శ్రీరాముడి మందిరం నిర్మాణం గురించి, శ్రీరాముడు గురించి అభ్యంతరకరంగా వివాదాస్పద వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫోస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని రాయచూరు పోలీసులు అరెస్టు చేశారు.

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

బెంగళూరులో కర్ఫ్యూ..... ఏం జరిగింది ?

బెంగళూరులో కర్ఫ్యూ..... ఏం జరిగింది ?

బెంగళూరు సిటీలోని పులకేశీనగర శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గం దేవుడిని అవహేళన చేస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ఆరోపణలు రావడంతో సిలికాన్ సిటీలోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అల్లకల్లోలం జరిగింది. ఈ దెబ్బతో ఇప్పటికీ డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో కర్ఫ్యూ, బెంగళూరు సిటీలోని అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.

310 మంది అరెస్టు

310 మంది అరెస్టు


బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలపై పెట్రోల్ పోసిన అల్లరిమూకలు వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 310 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

రాయచూర్ లో సేమ్ సీన్ రిపీట్ ?

రాయచూర్ లో సేమ్ సీన్ రిపీట్ ?

బెంగళూరులో ఎలా గొడవలు జరిగాయో అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లా, దేవదుర్గ పట్టణంలో అలాంటి గొడవలు సృష్టించడానికి ఓ వర్గం అల్లరిమూకలు ప్రయత్నించాయి. అయోధ్యలోని శ్రీరామమందిరం, శ్రీరాముడి గురించి నీచంగా, అవహేళనగా వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా వాటిని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. బెంగళూరులో ఎలా గొడవలు జరిగాయో అచ్చం అలాగే రాయచూరు జిల్లాలో గొడవలు సృష్టించడానికి ఓ వర్గం అల్లరిమూకలు ప్రయత్నించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

 హిందూ.... ముస్లీం సోదరులు

హిందూ.... ముస్లీం సోదరులు

శ్రీరాముడు, అయోధ్య రామమందిర నిర్మాణంగా గురించి ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో అప్రమత్తం అయిన పోలీసు అధికారులు వెంటనే దేవదుర్గ పట్టణంతో పాటు రాయచూరు జిల్లాలోని హిందూ, ముస్లీం మత పెద్దలతో సమావేశం అయ్యి వారితో శాంతి చర్చలు జరిపారు. మతఘర్షణలు జరగకుండా పోలీసులు వెంటనే జాగ్రత్తలు తీసుకోవడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

అరెస్టు చేస్తారా ? మా పని మేము చేసేదా

అరెస్టు చేస్తారా ? మా పని మేము చేసేదా


అయోధ్య రామమందిరం గురించి, శ్రీరాముడిని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తారా ? లేదా ? చూసిచూడనట్లు వ్యవహరిస్తే మేమే రంగంలోకి దిగుతామని శ్రీరామసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఫేస్ బుక్ లో శ్రీరాముడి గురించి అవహేళగా పోస్టు చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ముందు జాగ్ర్తతగా దేవదుర్గ పట్టణంతో పాటు రాయచూరు జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Lord Sri Ram: A Facebook Post allegedly posted by a non hindu youth defaming Lord Sri Ram disturbs Devadurga town. Police controlling the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X