బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏందీది.. విడాకుల కోసం కోర్టుకు వచ్చి.. కౌన్సిలింగ్ తీసుకొని, ఆపై కత్తితో గొంతుకోసి..

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ భర్త.. భార్యపై అక్కసుతో వ్యవహరించాడు. విడాకులకు ఆప్లై చేసిన వారు.. కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఆ తర్వాతే దాడి చేశాడు. దీంతో అతని భార్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. వారికి ఏడేళ్ల కింద పెళ్లయ్యింది. విభేదాలతో కోర్టు మెట్లెక్కారు. కౌన్సెలింగ్ లో నచ్చజెబితే కలిసి ఉంటామన్నారు. కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటికి వచ్చిన కాసేపటికే భర్త ఓ కత్తి తీసుకుని భార్య గొంతు కోసి చంపేశాడు.

కర్ణాటకలోని హాసన్ జిల్లా హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఘటన జరిగింది. హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, చైత్ర అనే మహిళకు ఏడేళ్ల క్రితం పెళ్లయయింది. విభేదాలు తలెత్తడంతో కొంతకాలం నుంచి వేరుగా ఉంటున్నారు. ఇటీవల ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఆఫ్లై చేసుకున్నారు. కోర్టు అధికారులు వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. విభేదాలను పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. కౌన్సెలింగ్ సెషన్‌లో అందుకు ఇద్దరూ అంగీకరించారు. కలిసి ఉంటామని ఇద్దరూ అధికారులకు చెప్పారు.

Man Slits Wifes Throat At Karnataka Court

కోర్టులోని కౌన్సెలింగ్ గది నుంచి బయటికి వచ్చాక కాసేపు ఆవరణలో నిలబడ్డారు. చైత్ర బాత్రూం కోసం వెళుతుండగా.. శివకుమార్ ఒక్కసారిగా ఆమె వైపు దూసుకెళ్లాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో చైత్ర గొంతు కోసేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ ఉన్న కొందరు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

రక్తపు మడుగులో పడిపోయిన చైత్రను బంధువులు, అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. అసలు కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఏం జరిగిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శివకుమార్ కోర్టు కాంప్లెక్స్‌లోకి కత్తిని ఎలా తీసుకు వచ్చాడనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు.

English summary
man slit the throat of his wife with machete at a family court in Karnataka where the two had gone to attend a counselling session after they filed for divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X