బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Manipal campus: దెబ్బకు క్లోజ్, వారంలో కరోనా అరాచకం, ఏక్ మార్... స్టూడెంట్స్ షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి/ మణిపాల్: కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ క్యాంపస్ కంటైన్మైంట్ జోన్ గా ప్రకటించారు. మణిపాల్ క్యాంపస్ లో ఒకేసారి ఏకంగా 59 మందికి కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ అని వెలుగు చూడటంతో అక్కడ ఉంటున్న విద్యార్థులు వారి కుటుం సభ్యులు హడలిపోయారు.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ను కంటైన్మైంట్ జోన్ గా
ఆపి జిల్లా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు మణిపాల్ క్యాంపస్ లో 86 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనాయి.

COVID-19: లాక్ డౌన్, కర్ఫ్యూ, సీఎం క్లారిటీ, బర్త్ డేలు, పెళ్లిళ్లు, నాలుగు గోడల మధ్యే ఇదంతా !COVID-19: లాక్ డౌన్, కర్ఫ్యూ, సీఎం క్లారిటీ, బర్త్ డేలు, పెళ్లిళ్లు, నాలుగు గోడల మధ్యే ఇదంతా !

ఏక్ మార్.... స్టూడెంట్స్ షాక్

ఏక్ మార్.... స్టూడెంట్స్ షాక్

మణిపాల్ క్యాంపస్ లో చదివే 59 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో మొత్తం క్యాంపస్ ను కంటైన్మైంట్ జోన్ గా ప్రకటించాల్సి వచ్చింది.హాస్టళ్ళ నుండి విద్యార్థులు బయటికి రాకుండా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే క్యాంపస్ లో, ఆవరణలో రాక పోక ల పై రెండు వారాల పాటు ఆంక్షలు విధించారు.

 ఐదు రోజుల్లో అలజడి

ఐదు రోజుల్లో అలజడి


మార్చి 11 నుంచి 16వ తేదీ వరకు వారం వ్యవధిలోనే మణిపాల్ క్యాంపస్ లో 59 కోవిడ్ కేసులు నమోదు కావడంతో ఉడిపి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం రెండు రోజుల్లోనే అంటే మార్చి 15 వ తేదీన 17 కేసులు, మార్చి 16న 25 కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

 మణిపాల్ క్యాంపస్ అంటే మాటలా !

మణిపాల్ క్యాంపస్ అంటే మాటలా !


ప్రతిష్టాత్మక మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులను ఆకర్షిస్తుంది‌. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి పోటీ పడుతుంటారు. మణిపాల్ క్యాంపస్ లోని విద్యార్థులకు తాజాగా COVID-19 పరీక్షలు జరిపిన తర్వాతే తగిన గుర్తింపు కలిగి ఉన్న అత్యవసర సిబ్బంది లేదా ఫ్యాకల్టీ ని క్యాంపస్ లోకి అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు.

 క్యాంపస్ మాత్రమే.... మిగతా ఫ్రీ జోన్స్

క్యాంపస్ మాత్రమే.... మిగతా ఫ్రీ జోన్స్

ఉడిపి లో
ప్రస్తుతానికి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ లో మాత్రం ఆంక్షలు విధించారు. ఉడిపి నగరంలోని ఇతర విద్యాసంస్థల పై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్ ఐటీ పరిపాలన విభాగం థియరీ తరగతులను ఆన్ లైన్లో నిర్వహించాలని మణిపాల్ క్యాంపస్ విభాగం అధికారులు నిర్ణయించారు. ల్యాబ్ మరియు
ప్రాక్టికల్ క్లాస్ లు వాయిదా వేయాలని భావిస్తోంది.

దేవుడు.... ఏంది నాయనా... ఈ కరోనా అరాచకం ?

దేవుడు.... ఏంది నాయనా... ఈ కరోనా అరాచకం ?

కర్ణాటక ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో 1, 275 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నాలుగు కోవిడ్ మరణాలు నమోదైనాయని వెలుగు చూసింది. దీంతో కర్ణాటకలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 9. 63 లక్షలు, కరోనా మరణాల సంఖ్య 12,407 కు చేరుకుంది.
ఉడిపి జిల్లాలో కొత్తగా మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

English summary
Coronavirus: The Udupi district Administration has declared Manipal Institute of Technology campus as a containment zone since 86 Covid-19 cases were reported in a single week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X